రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టానికి టైమ్ ఆసన్నమైంది.అందరూ ఎదురుచూస్తున్నట్టు నిన్న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దీంతో ప్రత్యక్షరాజకీయ సమరానికి అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.ఎలాగైనా గెలిచి ప్రతిపక్షాలకు ఉనికి లేకుండా చేయాలని టీఆర్ ఎస్ భావిస్తోంది.
అటు ఈటల రాజేందర్ కూడా తన సత్తా ఏంటో చూపించాలని సిద్ధమవుతున్నారు.దీంతో హుజూరాబాద్ వేదికగా రాజకీయ రణరంగానికి అన్ని పార్టీలూ పావులు కదుపుతున్నాయి.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడొస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో అక్టోబర్‌లోనే వచ్చే అవకాశం ఉన్నట్టు సమచారం.అప్పటి వరకు కరోనా తీవ్రత కూడా తగ్గుతుంది కాబట్టి ఆ నెలలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.కాగా అంత లేట్ అయితే బీజేపీకి మైనస్ అవుతుంది.
అందుకే వారు తొందరగా నిర్వహించాలని భావిస్తున్నారు.
ఈటలపై ప్రజల్లో ఉన్న సానుభూతి లేట్ అయితే తగ్గిపోతుందని, కాబట్టి త్వరగా నిర్వహించాలని కమలనాథులు భావిస్తున్నారు.ఇంకోవైపు టీఆర్ ఎస్ మాత్రం లేట్ అయితేనే బెన్ఫిట్ అని చూస్తోంది.అప్పటికి ఈటల ప్రభావం కూడా మీడియాలో, ప్రజల్లో తగ్గుతుంది కాబట్టి తాము గెలిచే అవకాశం ఉంటుందిన ఆలోచిస్తోంది.
అప్పటి వరకు సరైన నాయకుడిని నిర్ణయించి ప్రజల్లో తిప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నారు.పోటీ చేసేందుకు చాలామంది ముందుకు రావడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో టీఆర్ ఎస్‌కు అర్థం కావట్లేదు.
కాబట్టి టైమ్ దొరికితే అసలైన నాయకుడిని ముందుకు తీసుకురావొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.ఇంకోవైపు కాంగ్రెస్ చీఫ్ ఎంపిక త్వరలోనే జరగనుంది.దాంతో కొత్త సారథి నేతృత్వంలోనే కాంగ్రెస్ పోటీచేసే అవకాశాలు ఉన్నాయి.ఇది ఆ పార్టీకి మేలు జరిపే అంశం.
ఇలా మూడు ప్రధాన పార్టీలూ అన్ని అవకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి.చూడాలి మరి వీరిలో ఎవరి పార్టీ గెలుస్తుందో.