గోరింటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మహిళలకు గోరింటాకుకు మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది.
ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎంతో అందంగా తయారవుతుంటారు.గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏమిటి? గోరింటాకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యింది.
ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది.ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వత రాజుకు చెప్పగానే రాజు సతీసమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు.
అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దయి రాజుతో ఈ విధంగా అన్నది.నేను సాక్షాత్తు పార్వతీ దేవిరుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది.
అని అడగగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది.ఆమె వేళ్లు ఎర్రగా పండుతాయి.
అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురి వేళ్ళు కంది పోయాయి అనగా.అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వత రాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు.అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది.గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్లు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునే వారు.
గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తోంది.గోరింటాకు ఎర్రగా పండటం వల్ల నుదిటిపై గోరింటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం కాగా.
గోరింటాకు నుదిటిపై పండదని కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు.అప్పటినుంచి గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత కలిగింది.