బుల్లితెరపై సమయస్పూర్తితో పంచ్ లు వేస్తూ మేల్ యాంకర్ గా ప్రేక్షకుల్లో రవి బాగానే పాపులారిటీని సొంతం చేసుకున్నారు.గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గినా బుల్లితెరపై మేల్ యాంకర్లలో ప్రదీప్ తరువాత రవి చేతిలోనే ఎక్కువగా షోలు ఉన్నాయి.
అయితే రవి కొన్నిసార్లు కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.రవి వివాదాల్లో చిక్కుకున్న సమయంలో నెటిజన్ల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
యాంకరింగ్ లో అమ్మాయిలదే హవా అయినప్పటికీ రవి, ప్రదీప్ మాత్రం యాంకర్లుగా సత్తా చాటారు.రవి ప్రస్తుతం సుమతో కలిసి జీతెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ కాగా షాదీ ముబారక్ మూవీ టీమ్ అయ్యారు.సుమ షాదీ ముబారక్ లో మెయిన్ ఎవరు అంటే సునీల్ కశ్యప్ అని సునీల్ కశ్యప్ ను పెళ్లై ఎన్నేళ్లు అయిందని అడుగుతారు.
సునీల్ కశ్యప్ ఎనిమిదేళ్లు అయిందని తెలిపారు.
రవి వెంటనే ఎనిమిదేళ్లుగా వాయిస్తున్నారంటూ సునీల్ కశ్యప్ పై పంచ్ వేస్తారు.
ఆ తర్వాత సుమ షాదీపై మీ అభిప్రాయం ఏమిటి.? అని అడగగా రవి నోరు మంచిది కాదని మంగ్లీ చెబుతారు.ఆ మాట సరిగ్గా వినని రవి సూపర్ అని చెప్పి ఆ తర్వాత ఆశ్చర్యానికి లోనవుతారు.ఆ తరువాత ఇలాగే ఒకసారి హా సూపర్ అన్నావని బాగా అయ్యిందని రారండోయ్ వేడుక చూద్దాం షూటింగ్ సమయంలో జరిగిన ఘటన గురించి సుమ చెప్పుకొచ్చారు.
రారండోయ్ వేడుక చూద్దాం మూవీ ఈవెంట్ సమయంలో చలపతిరావు చేసిన కామెంట్ ను రవి సూపర్ అంటూ ప్రశంసించారు.ఆ తరువాత రవి తనకు వినబడలేదని చెప్పినా ఆ వివాదం పెద్దది కావడం రవిపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.