సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సౌందర్య.కన్నడ నుంచి వచ్చిన సౌందర్య మాతృభాషలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి అందరికి తెలుగమ్మాయిగా చేరువ అయిపొయింది.
ఎక్కువగా హోమ్లీ పాత్రలకి ప్రాధాన్యత ఇచ్చే సౌందర్య టాలీవుడ్ లో అప్పట్లో ఉన్న స్టార్స్ అందరితో జత కట్టింది.మాయలోడు సినిమాతో రాజేంద్రప్రసాద్ జోడీగా తెరంగేట్రం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏకంగా 15 ఏళ్ల పాటు తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఆ సమయంలో సౌందర్యకి పోటీగా రమ్యకృష్ణ ఉండేది.తెలుగు అమ్మాయి తరహా పాత్రలు చేయడంతో తెలుగు ప్రేక్షకులు సావిత్రి తర్వాత సౌందర్యనే అంతగా ఆరాధించారు.
ఆమె హీరోయిన్ గా కెరియర్ ముగిసిన దశలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.అనుకోకుండా ఎన్నికల ప్రచారానికి వచ్చి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
సౌందర్య జీవితం తెరిచిన పుస్తకం ఏమీ కాదని కన్నడ నాట వినిపిస్తూ ఉంటుంది.ఆమె కర్నాటకకి చెందిన అమ్మాయి కావడం అక్కడి వారికి సౌందర్య గురించి ఎక్కువ తెలుసు ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సౌందర్య బయోపిక్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికి ఈ బయోపిక్ కథ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో త్వరలో ఈ సినిమాని అన్ని సౌత్ బాషలలో తెరకెక్కించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం సాయి పల్లవిని ఇప్పటికే సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా అంగీకరించిందని తెలుస్తుంది.