ఈ మధ్యకాలంలో సౌత్ హాట్ బ్యూటీ రెజినా తెలుగులో సినిమాలు చాలా వరకు తగ్గిపోయాయి.సరైన అవకాశాలు రాకపోవడంతో మాతృభాషలో సినిమాలు చేసుకుంటుంది.
తెలుగులో మంచి స్పీడ్ మీద ఉన్న సమయంలో బాలీవుడ్ లో ఓ ఆఫర్ వచ్చిందని ఇక్కడి అవకాశాలని వదులుకొని మరీ వెళ్ళింది.ఆ సినిమాలో సోనమ్ కపూర్ కూడా ఉండటంతో సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం ఆమెనే కొట్టుకుపోయింది.
తరువాత తెలుగులో మళ్ళీ ప్రయత్నాలు చేసిన అనుకున్న స్థాయిలో హీరోలకి జోడీగా మాత్రం ఛాన్స్ లు రాలేదు.అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో సెవెన్, ఎవరు అనే సినిమాలు చేసింది.
ఈ రెండు సినిమాలలో ఆమె పెర్ఫార్మెన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది.
అడవి శేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఎవరు సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం రెజినాకి సొంతం అవుతుందని చెప్పాలి.
అంతగా ఆమె పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం అడవి శేష్ కి పోయింది.
దాని తర్వాత ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమాలో నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకి రాలేదు.చిరంజీవి ఆచార్య మూవీలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది.
అయితే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ లో ఓ కొరియన్ మూవీ రీమేక్ లో రెజినా నటించాబోతుంది.సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకి శాకినీ-డాకినీ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.
ఇందులో రెజినాతో పాటు నివేథా థామస్ కూడా మరో లీడ్ రోల్ లో నటిస్తుంది.త్వరలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని సమాచారం.