పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన అంజలి.. ఏం చెప్పారంటే..?

తెలుగమ్మాయి అయిన అంజలి తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి నటిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగుతో పోలిస్తే తమిళంలోనే అంజలికి ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

వకీల్ సాబ్ మూవీలో ముఖ్య పాత్రలో నటించిన అంజలి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించారు.వకీల్ సాబ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న అంజలికి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

తెలుగులో సీనియర్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న అంజలి ప్రస్తుతం సినిమా ఆఫర్లతో బిజీగా ఉండటంతో పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తానని చెప్పారు.ఆ సమయంలో వకీల్ సాబ్ దర్శకుడు పెళ్లి తర్వాత సినిమాలలో నటించవా.? అని ప్రశ్నించగా అంజలి ఆ ప్రశ్నకు సినిమాలు, పెళ్లి రెండూ ఒకేసారి ఎందుకు.? అని చెప్పారు.పెళ్లి తర్వాత కూడా కొంతమంది హీరోయిన్లు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు అంజలి ఒక కోలీవుడ్ హీరోతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు గతంలో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.అయితే తాజాగా ఒక సందర్భంలో అంజలి తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలిపారు.

Advertisement

అయితే ఆమె ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.అంజలి వయస్సు ప్రస్తుతం 34 సంవత్సరాలు కాగా ఆమె త్వరలో పెళ్లికి సంబంధించిన వార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.

తెలుగులో వకీల్ సాబ్ రిజల్ట్ పైనే అంజలి కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.మహిళా సాధికారత అంశంతో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీలో అంజలి పాత్రకు బాగానే ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగెళ్ల కీలక పాత్రల్లో నటిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు