కరోనా కారణంగా గత ఏడాది దాదాపుగా పది నెలల పాటు థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి.దాంతో ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకుండా దాదాపు ఏడాది పాటు వాయిదా పడ్డాయి.
సగంలో ఆగిన సినిమాలు మరియు గత ఏడాది విడుదల అవ్వాల్సిన సినిమాలు అన్ని కూడా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతున్నాయి.ఫిబ్రవరి నెల నుండే పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఒక్కో వారం మూడు నాలుగు సినిమా లు వస్తున్నాయి.ముందు ముందు మరిన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
వచ్చే నెల నుండి పెద్ద సినిమా ల విడుదల ఉన్నాయి.వచ్చే నెల ఆరంభంలోనే వైల్డ్ డాగ్ మరియు ఆ తర్వాత వారం వకీల్ సాబ్ సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లపై మళ్లీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం థియేటర్లను అధికారికంగా ఆపేయడం లేదు.
కాని జనాలు మాత్రం కరోనా భయంతో బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అంటున్నారు.వచ్చే నెల రెండవ వారం లేదా మూడవ వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ లు చేస్తున్నారు.ఇలాంటి సమయంలో కొన్ని సినిమా ల విడుదల విషయంలో పునరాలోచించాలనే ఉద్దేశ్యంతో కూడా ఉన్నారట.
కొందరు మాత్రం ఇప్పుడు వాయిదా వేస్తే వరుసగా ఉన్న సినిమా ల కారణంగా ఎప్పటి వరకు ఈ విషయమై క్లారిటీ వచ్చేది తెలియడం లేదు అంటున్నారు.అందుకే ఇప్పుడు విడుదల వాయిదా వేయాలనుకోవడం లేదని ఒక నిర్మాత అంటే మరో నిర్మాత మాత్రం విడుదల వాయిదా వేసే విషయమై చర్చిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
మొత్తానికి అన్ని కాకున్నా కొన్ని మాత్రం వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది.