తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది.
అధికార పార్టీ అన్నాడిఎంకె తో పొత్తు పెట్టుకున్న బిజెపి 20 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది.ఇలాంటి తరుణంలో ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమిళ రైతులు ఊహించని రీతిలో సరికొత్త షాక్ ఇచ్చారు.
మేటర్ లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన రైతులు ఏయే స్థానాలలో అయితే బిజెపి పార్టీ పోటీ చేస్తుందో ఆ ప్రాంతాలలో .రైతులు పోటీకి దిగారు.ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నగ్నంగా వెళ్లి నామినేషన్లు వేస్తామని, కచ్చితంగా బీజేపీని ఓడించి తీరుతామని తమిళ రైతులు వార్నింగ్ ఇచ్చారు.మొదటి నుండి కేంద్రం తీసుకున్న సాగు చట్టాల విషయంలో దక్షిణాది భారతదేశం నుండి తమిళ రైతులు పోరాడుతూ ఉన్న సంగతి తెలిసిందే.
మరోపక్క ఢిల్లీలో కూడా రైతులు ఇంకా కేంద్రంపై ఉద్యమం చేస్తూ ఈనెల 26న భారత బంద్ కి పిలుపునివ్వడం జరిగింది.
.