సెప్టెంబర్ 27న ఢిల్లీ లో జన్మించిన రాహుల్ దేవ్ కౌశల్ మోడల్ రంగంలో అడగు మోపి ఆ తర్వాత వెండితెర పై నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.ఆయన ప్రధానంగా హిందీ, పంజాబీ, భోజ్ పూరి, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒడియా, తమిళ భాషా చిత్రాలలో నటించి భారత దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను మెప్పించారు.1997లో దాస్ మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన 86 సినిమాల్లో విలన్ పాత్ర లో నటించి మెప్పించారు.అయితే ఛాంపియన్ సినిమాలో విలన్ పాత్రలో ఉత్తమ నటనను ప్రదర్శించినందుకు గాను ఆయన 2001వ సంవత్సరంలో బెస్ట్ విలన్ గా ఫిలిం ఫేర్ అవార్డు కు నామినేట్ అయ్యారు.
ఇక టాలీవుడ్ లో సింహాద్రి, సీతయ్య వంటి చిత్రాల్లో విలన్ గా నటించిన రాహుల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.అయితే చాలా సంవత్సరాల పాటు వెండితెరపై తన నటనా ప్రతిభతో ఆడియన్స్ ని ఎంటర్టయిన్ చేసిన రాహుల్ బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్ గా పాల్గొని వావ్ అనిపించారు.
పలు హిందీ ధారావాహికల్లో చిన్నతెర పైన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ప్రస్తుతం ఆయన ఒక పాపులర్ హిందీ దారావాహిక లో ప్రతినాయకుడి గా నటిస్తున్నారు.
ఇక రాహుల్ వ్యక్తిగత విషయం గురించి మాట్లాడుకుంటే.1998 లో రీనా ను పెళ్లి చేసుకున్న రాహుల్ ఓ బాబు కి తండ్రి కూడా అయ్యారు.అయితే బాబు పుట్టిన తర్వాత రీనా క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు.దీంతో బాగా బాధ పడి పోయిన రాహుల్ తన భార్య కు పెద్ద ఆసుపత్రులలో మెరుగైన చికిత్స చేయించారు కానీ ఆమెకు నయం కాలేదు.దీనితో కొద్ది సంవత్సరాల పాటు క్యాన్సర్ వ్యాధి తో పోరాడిన ఆమె చివరికి తన తుది శ్వాస విడిచారు.2009లో రీనా చనిపోగా రాహుల్ తన బాబును ఒంటరిగానే పెంచి పోషిస్తున్నారు.ఆమె చనిపోయిన విధానం వల్లనే మల్లి పెళ్లి చేసుకోవడనికి రాహుల్ దేవ్ ఇష్టపడటం లేదు.ఆమె చికిత్స కు డబ్బు కోసం తన ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు.
ఒకానొక దశలో సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి నా భార్యకు చికిత్స చేయించుకుంటాను అని రాహుల్ దేవ్ ప్రకటించాడు కూడా.అంతలా ఆమె కోసం తాపత్రయ పడ్డాడు.అయినా కూడా ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఇక 11 ఏళ్ళ కొడుకు బాగోగులు చూసుకోవడానికి కొన్ని రోజుల పాటు రాహుల్ దేవ్ షూటింగ్ మానేసి ఇంట్లోనే ఉన్నాడు.
కొడుకు సిద్దాంత్ కి వండి పెట్టడం, స్కూల్ కి పంపించడం, హోమ్ వర్క్ చేయించడం వంటివి మాత్రమే చేసాడు కొన్ని రోజుల పాటు.ఆ తర్వాత కొడుకుని లండన్ కి చుట్టాల దగ్గరికి పంపించి చదివించాడు.
కొన్నాళ్ల క్రితం లండన్ నుండి తిరిగి వచ్చిన కొడుకు ఎంతో పెద్ద వాడు అయ్యాడుఅయితే గత కొంత కాలంగా ఆయన ముగ్దా గాడ్సే అనే ఓ యాక్టర్ తో ప్రేమాయణం నడిపిస్తున్న పెళ్ళికి మాత్రం నో అంటున్నారు రాహుల్ దేవ్.
ఇది ఇలా ఉండగా రాహుల్ దేవి కి ముఖుల్దేవ్ అనే సోదరుడు ఉన్నాడు.ముకుల్దేవ్ కూడా నటనా రంగంలోనే కొనసాగుతున్నారు.1996లో మమ్ కిన్ సీరియల్ లో తొలిసారిగా నటించిన ముకుల్దేవ్ ఆ తర్వాత బాలీవుడ్ కామెడీ సీరియల్ లో కూడా నటించారు.అనంతరం ఆయన తన సోదరుడి లాగానే సినిమాల్లో విలన్ పాత్రలను పోషిస్తూ గుర్తింపు దక్కించుకున్నారు.మొదట్లో బాలీవుడ్ లో విలన్ గా నటించి మెప్పించిన ఆయన ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో బడా హీరోల సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి అలరించారు.
ఏది ఏమైనా ఈ ఇద్దరు అన్నదమ్ములు సినిమాల్లో పోటాపోటీ గా నటిస్తూ అసలు సిసలైన విలనిజం చూపిస్తున్నారు.
.