యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్ వస్తుందేమోనని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూశారు.కానీ చిత్ర యూనిట్ వారికి పండగ పూట పంగనామం పెట్టింది చిత్ర యూనిట్.
ఊరించి ఊరించి ఉసూరుమనిపించడంతో రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.సంక్రాంతి కానుకగా టీజర్ రిలీజ్ అవుతుందేమో అని వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలి తరహా విజయం సాధిస్తాడా లేక సాహో లాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.మరి రాధేశ్యామ్ చిత్రానికి సంబంధించిన టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.