మెగా డాటర్ నిహారిక పెళ్లికి మరి కొన్ని గంటలే మిగిలి ఉంది.ఇప్పటికే రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్లింది.
ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఇంకా రాజస్థాన్ చేరుకోలేదు.అసలు పవన్ పెళ్లికి వెళ్తాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.
పవన్ కళ్యాణ్ ఎన్నో వేడుకలకు వెళ్తూ ఉంటాడు.అన్నయ్య కూతురు పెళ్లికి వెళ్లడం ముఖ్యం.
ఆయన అభిమానులు మరియు సన్నిహితులు అంతా కూడా ఆయన పెళ్లికి హాజరు అవ్వాలని కోరుకుంటున్నారు.కాని నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నాడు.
మొన్నటి వరకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన పవన్ ఇప్పుడు వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందడం లేదు అంటూ దీక్షకు కూడా కూర్చున్నాడు.ఈ విషయంలో మెగా అభిమానులు కాస్త నిటూర్చుతున్నారు.
నిహారిక పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఏంటీ ఈ దీక్షలు అంటున్నారు.
నిహారికకు పవన్ అంటే చాలా అభిమానం.
నాగబాబుకు కూడా పవన్ అంటే చాలా ఇష్టం.ఆ అభిమానంతోనే తమ్ముడు స్థాపించిన పార్టీ కోసం పని చేస్తున్నాడు.
ఎవరైనా పవన్ ను ఏమైనా అంటే నాగబాబు మొదట స్పందిస్తాడు అనడంలో సందేహం లేదు.అందుకే నాగబాబు కు పవన్ కు సన్నిహిత్యం ఉంటుందని అంతా అనుకున్నారు.
కాని ఇప్పుడు నిహారిక పెళ్లికి హాజరు కాకుండా ఉంటే ఎలా పవన్ కళ్యాణ్ కు నాగబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుకుంటారు అంటూ కొందరు అంటున్నారు.నిహారిక పెళ్లికి పవన్ కుటుంబం మొత్తంతో వెళ్తాడని మొన్నటి వరకు అనుకున్నారు.
కాని ఇప్పుడు మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజస్థాన్ వెళ్లలేదు.
రేపు ఒక్క రోజే సమయం ఉంది.మరి రేపు కూడా పవన్ రైతుల కోసమే అంటూ ఉంటే పెళ్లికి హాజరు అవ్వనట్లే అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.