బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో ఒకరైన కరాటే కళ్యాణి రెండో వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఎలిమినేట్ అయిన రోజు నుంచి కరాటే కళ్యాణి మీడియా ఛానెళ్లకు, వెబ్ సైట్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వివిధ అంశాలపై స్పందిస్తోంది.
ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోని వివిధ అంశాలపై స్పందించిన కరాటే కళ్యాణి ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో వివాదాస్పదమైన డిక్లరేషన్ అంశం గురించి మాట్లాడుతూ సీఎం జగన్ తీరును తప్పుబట్టింది.తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించడానికి హాజరైన సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వని సంగతి తెలిసిందే.ఏపీలో ఇతర రాజకీయ పార్టీలు సైతం డిక్లరేషన్ విషయంలో జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాయి.
సీఎం జగన్ డిక్లరేషన్ విషయంలో తప్పు చేశారని.తిరుమల నిబంధనలను బ్రేక్ చేసే హక్కు సీఎంకైనా, పీఎంకైనా ఉండదని వెల్లడించారు.
జగన్ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు.
తిరుమల నిబంధనలను పాటించకుండా ఎవరికి వాళ్లు నిబంధనలు పెట్టుకోవడం సరికాదని ఆమె అన్నారు.
జగన్ ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేసిన సమయంలో భగవద్గీతతో పాటు ఖురాన్, బైబిల్ పై ప్రమాణం చేసినా జగన్ మనస్సులో బైబిల్ మాత్రమే ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జగన్ ఇష్టం వచ్చిన విధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్టని ప్రశ్నించారు.
డిక్లరేషన్ ఇవ్వకపోవడం వల్ల జగన్ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని అన్నారు.దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని.
త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నానని చెప్పారు.కరాటే కళ్యాణి అకస్మాత్తుగా జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది.