భారతదేశంలో అనేక రకాల మొబైల్స్ ను తక్కువ ధరలో అందించిన షియోమి సంస్థ తాజాగా స్మార్ట్ ట్రిమ్మర్ ను లాంచ్ చేసింది.ఎమ్ఐ బియర్డ్ ట్రిమ్మర్ వన్ సి పేరుతో తన సరికొత్త ట్రిమ్మర్ ను విడుదల చేసింది.ఇక ఈ ట్రిమ్మర్ ధర కూడా కేవలం రూ.999 మాత్రమే.ఈ ట్రిమ్మర్ విషయానికి వస్తే… ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 60 నిమిషాల పాటు దీనిని నిరంతరాయంగా వాడుకోవచ్చు.ఇందులోని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 2 గంటల సమయం మాత్రం చాలు.
అంతేకాదు బ్యాటరీ శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఎల్ఈడీ లైట్లు కూడా ఏర్పాటు చేసింది.అంతేకాదు ట్రిమ్ చేసుకోవడానికి హెయిర్ లెంత్ సెట్టింగ్స్ కోసం ఏకంగా 20 రకాల లెంత్ లను ఇందులో పొందుపరిచింది.
ఈ ట్రిమ్మర్ బాక్సులో ట్రావెల్ పౌచ్, ట్రిమ్మింగ్ కంబ్, ఛార్జింగ్ కేబుల్, క్లీనింగ్ బ్రష్ లు ట్రిమ్మర్ కు చెందిన బాక్స్ లో ఉంటాయి.
ఇప్పటికే షియోమీ సంస్థ భారతదేశంలో స్మార్ట్ విషయంలో అనేక సంచలనాలు సృష్టించింది.ఆ తర్వాత ఒక్కొక్కటిగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ల్యాప్ టాప్ లాంటి వివిధ రకాల స్మార్ట్ సంబంధించిన ఉత్పత్తులను లాంచ్ చేస్తూ భారత్ లో మార్కెట్ ని విస్తరించింది.తాజాగా స్మార్ట్ ట్రిమ్మర్ ను కూడా లాంచ్ చేసి స్మార్ట్ ప్రపంచంలో మరో ముందడుగు వేసింది షియోమి సంస్థ.