ప్రస్తుత కాలంలో కొందరు చట్టాలు, పోలీసుల పై భయం లేకుండా ప్రవర్తిస్తూ అమాయకపు మహిళలను చిదిమేస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కిరాణా దుకాణం కి సరుకులు కొనుక్కోవడానికి వచ్చిన మహిళ పై దారుణంగా దాడి చేసి హత్యా చేయడమేగాక మహిళ మృతదేహం పై అత్యాచారం చేసి మృతదేహాన్ని చివరికి నగర శివార్లలోవిసిరేసిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే స్థానిక ముంబై నగర పరిసర ప్రాంతంలో 25 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మహిళ భర్త కుటుంబ పోషణ నిమిత్తమై పాల వ్యాపారం చేసేవాడు.
అయితే తాజాగా మహిళ కిరాణా సామాగ్రి కొనేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఓ దుకాణానికి వెళ్ళింది.కాగా దుకాణ యజమాని ఒంటరిగా ఉండడంతో మహిళను గదిలోకి లాక్కెళ్లి ఆమెపై దారుణంగా ఇనుప వస్తువులతో దాడి చేశాడు.
దీంతో తీవ్ర రక్త స్రావానికి గురయినటువంటి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.అయినప్పటికీ నిందితుడు ఆమె పై కనికరం చూపకుండా మృతదేహంపై అత్యాచారం చేశాడు.అనంతరం ఆ మృతదేహాన్ని నగర శివార్లలో కి తీసుకెళ్ళి చెట్ల పొదల్లోకి విసిరేసాడు.
దీంతో మహిళ భర్త తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మహిళ చివరిగా దుకాణానికి వెళ్ళినట్లు తెలుసుకొని యజమానిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయం బయట పడినట్లు పోలీసులు చెబుతున్నారు.