వామ్మో.. ఒక్క రోజులో సూర్యుడినే మింగేయగలదట!?

ఏంటి? సూర్యుడిని మింగేయగలద? ఏంటబ్బా అది అని అనుకుంటున్నారా? ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తున్నారు.అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.విశ్వంలో మానవుడికి అంతు చిక్కని విషయం కృష్ణబిలం.

 Scientists, Milky Way, Sun, Massive Black Hole Discovered In Milky Way-TeluguStop.com

కృష్ణబిలంను అసలు గుర్తించలేరట.

కృష్ణబిలం మధ్యలో ఎంతో విపరీతమైన శక్తి విడుదల అవుతుంది.ఇంకా దాన్ని బట్టే కృష్ణబిలం శక్తిని అంచనా వేస్తుంటారు శాస్త్రవేత్తలు.

చుట్టుపక్కల ఉండే పదార్ధాన్ని కృష్ణబిలాలు ఏ స్థాయిలో శోషణ చేసుకుంటున్నాయో కూడా దీని ద్వారానే అర్ధం అవుతుంది.

ఇటీవల ఓ భారీ కృష్ణబిలంపై ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రిస్టోఫర్ ఒన్‌కెన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది.ఇంకా బృందమే ఓ అద్భుతమైన అరుదైన విషయాన్ని కనుగొన్నారు.జే2157 అనే కృష్ణబిలం విశ్వంలోనే అత్యంత వేగంగా పెరుగుతోందని, మన పాలపుంత కేంద్రంలో ఉన్న సూపర్‌మ్యాసివ్ కృష్ణబిలంకంటే ఇది 8వేల రెట్లు పెద్దదిగా ఉందని తెలిపింది.

ఇంకా అది ప్రతి రోజూ దాదాపు మన సూర్యుడిని సమానమైన పదార్థాన్ని మింగేస్తోందని ఆ బృందం చెప్పుకొచ్చింది.ఇంకా ఈ కృష్ణబిలం విశ్వంలోని అది పెద్దదట.ఇంతకంటే పెద్దదాన్ని ఇప్పటివరకు గుర్తించలేదను శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube