టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను డైరెక్టర్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా స్పో్ర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రానుంది.కాగా చడీ చప్పుడు లేకుండా గోపీచంద్ నటించిన ఓ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ అనే సినిమా కొన్నేళ్ల క్రితమే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై అప్పట్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి చాలా తక్కువ మందికి తెలుసు.అయితే ఈ వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.
దీంతో ఆరడుగుల బుల్లెట్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమా ఆడియెన్స్‌కు ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.అయితే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరి ఓటీటీలోనైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేక ఇక్కడ కూడా వాయిదా పడుతుందా అనేది చూడాలి.