ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 30 దేశాల్లో లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెల్సిందే.200 లకు పైగా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇరువై లక్షలకు చేరిక కరోనా పాజిటివ్ సంఖ్య భయాందోళనకు గురి చేస్తోంది.ఇండియాలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న కారణంగా కాస్త కేసుల సంఖ్య అదుపులో ఉందని చెప్పుకోవచ్చు.
ఇండియాలో మొదట 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించగా రెండవ దశలో 19 రోజుల పాటు అంటే మొత్తంగా 40 రోజుల పాటు ఇండియాలో లాక్‌డౌన్ అమలు కాబోతుంది.
ఇండియాలో 40 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో గతం విధించిన లాక్‌డౌన్‌లు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.1918 నుండి 1920 సంవత్సరాల మద్య కాలంలో ప్లూ ఎంజా వ్యాధి విజృంభించింది.ఆ సమయంలో వందలాది మంది మృతి చెందుతున్న నేపథ్యంలో అప్పటి నిజాం రాజు రెండవ అలీ ఖాన్ లాక్‌డౌన్‌ను అనధికారికంగా అమలు చేశారు.
తన రాజ్యం చుట్టు కంచె వేయించి మొత్తం 12 ద్వారాలను ఏర్పాటు చేయించాడు. ఉదయం 5 నుండి రాత్రి 7 గంటల వరకు మాత్రమే రాకపోకలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు.
రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో జన సంచారం ఉండవద్దంటూ ఆదేశించాడు. ఆ సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ ప్రతి ఒక్కరిని ఆదేశించారు.సైనికులు మరియు సేవకులు మాత్రమే బయట తిరగాలని సూచించాడు. వ్యవసాయ రంగంకు చెందిన వారిపై కూడా అప్పట్లో ఆంక్షలు పెట్టినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు.అంతగా నిజాం చర్యలు తీసుకోవడం వల్లే ఇతర ప్రాంతాలతో పోల్చితే ఆయన ఆస్థానంలో ప్లూ బాధితులు, మరణాలు తక్కువగా నమోదు అయ్యాయంటూ చరిత్ర కారులు చెబుతున్నారు.
.