రేపే(8వతేదీ) దేశ రాజధాని ఢిల్లీ లో ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల నగారా మోగిన దగ్గర నుంచి కూడా పోలింగ్ దగ్గర పడేవరకు రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటూనే ఉంది.
ఈ క్రమంలో వారు చేసిన వ్యాఖ్యలపై ఈసీ అధికారులు సీరియస్ అవుతున్నారు.ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలపై ఈసీ కి ఫిర్యాదు అందడం తో స్పందించిన అధికారులు ఆయనకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ షహీన్ బాగ్ కు బిర్యానీలు సరఫరా చేస్తున్నారంటూ యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఆయనకు నోటీసులు పంపింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ.
ప్రధాని మోదీ జాతీయతావాదం, అభివృద్ధికోసం పనిచేస్తూంటే మరోవైపు కాంగ్రెస్, కేజ్రీవాల్ వేర్పాటువాద శక్తులకు తోడ్పాటు అందిస్తున్నారని విమర్శించారు.ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం పోరు సాగిస్తూంటే.
కేజ్రీవాల్ షహీన్ బాగ్ ఆందోళనలకు మద్దతిస్తూ, నిరసనకారులకు బిర్యానీ తినిపిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఇలా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.ఆయన వ్యాఖ్యలపై శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ షోకాజ్ నోటీసులో అధికారులు పేర్కొన్నారు.
మరోపక్క రేపే పోలింగ్ ప్రారంభం కానుండడం తో గురువారమే అక్కడ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది.మొత్తం 70 స్థానాలకు గాను రేపు ఎన్నికలు జరగనుండగా, ఈనెల 11 న ఫలితాలు వెలువడనున్నాయి.

అయితే ఢిల్లీ లో పాగా వేయాలని బీజేపీ తన ప్రయత్నాలు చేసింది.మరోపక్క ఆప్ ఈ సారి కూడా ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని తమ ప్రచారాన్ని కొనసాగించారు.అయితే ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికలు దగ్గరకు రావడం తో భారీ గా భద్రతా పరంగా ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు.ఈ ఎన్నికల కోసం అలానే ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.