బాబు కొడుకు పదవి కోసం కంగారు పడుతున్నాడు

మండలి రద్దుతో తన కొడుకు ఎమ్మెల్సీ పదవి ఎక్కడ పోతుందో అని.

ఆ పదవి పోతే లోకేష్‌ రాజకీయ భవితవ్యం ఏంటో అని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత లోకేష్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రావడం అసాధ్యం అని బాబు అనుకుంటున్నాడు.అందుకే ఆయన ఎప్పటికి ఎమ్మెల్సీగానే ఉండాలని కోరుకుంటున్నారు.

ఇప్పుడు జగన్‌ నిర్ణయంతో మండలి రద్దు అయితే లోకేష్‌ రాజకీయంగా నిరుద్యోగి అవుతాడు.అందుకే చంద్రబాబు నాయుడు మండలి రద్దుపై నానా యాగీ చేస్తున్నాడు.

గతంలో మండలి అనేది డబ్బు దండగ అంటూ.అసలు అవసరం లేదు అంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా యూ టర్న్‌ తీసుకున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

Advertisement

మొత్తానికి చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు సంధిస్తున్న ప్రశ్నలతో తెలుగు దేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పలేక బిత్తర పోతున్నారు.చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకుల నోళ్లకు తాళం వేసినట్లుగా చేశాయి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు