రజినీకాంత్‌ ఏంటో ఈ జోరు

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఇటీవలే దర్బార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.దర్బార్‌ విడుదలకు ముందే శివ దర్శకత్వంలో రజినీకాంత్‌ ఒక సినిమాను మొదలు పెట్టాడు.

 Rajanikanth Next Movie Latest Update-TeluguStop.com

అది మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.రెండవ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

రెండవ షెడ్యూల్‌లో సినిమాను దాదాపుగా సగం పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.సమ్మర్‌ వరకు సినిమాను పూర్తి చేసి దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని రజినీకాంత్‌ భావిస్తున్నాడు.

Telugu Rajanikanth, Vijay Lokesh-Movie

ఒకవైపు దర్బార్‌ చేస్తూనే శివ చిత్రాన్ని ఎలా అయితే ఓకే చేసి మొదలు పెట్టాడో ఇప్పుడు అలాగే శివ సినిమాను చేస్తూనే దర్శకుడు లోకేష్‌ కనగరాజు దర్శకత్వంలో మరో సినిమాను రజినీకాంత్‌ సెట్‌ చేశాడు.వచ్చే సమ్మర్‌లోనే ఈ చిత్రంను ప్రారంభించబోతున్నారు.ప్రస్తుతం లోకేష్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.విజయ్‌ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే మరో సినిమాను అదే రజినీకాంత్‌తో సినిమాను లోకేష్‌ మొదలు పెట్టబోతున్నాడు.

Telugu Rajanikanth, Vijay Lokesh-Movie

రజినీకాంత్‌ ఆమద్య సినిమాలకు దూరం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.దూరం అవ్వడం ఏమో కాని వరుసగా చిత్రాలు చేస్తూ బాక్సాఫీస్‌పై చిన్నపాటి యుద్దంనే రజినీకాంత్‌ చేస్తున్నాడు.ఆయన జోరు చూస్తుంటే యంగ్‌ హీరోలు కూడా బేజారు అవుతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది రజినీకాంత్‌వి మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న రజినీకాంత్‌ సాధ్యం అయినన్ని సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube