తెలుగులో వైశాలి, గుండెల్లో గోదారి, సరైనోడు, అజ్ఞాతవాసి, యూ టర్న్, వంటి చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న టువంటి హీరో ఆది పినిశెట్టి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే తాజాగా ఆది పినిశెట్టి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సంబంధించినటువంటి కథలో నటిస్తున్నాడు.
ఇందులో ఆది పినిశెట్టి కోచ్ గా కనిపించనున్నాడు.
అయితే ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
అంతేగాక ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్న తెలుస్తోంది.అయితే తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన హిట్ లేక తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
సరైనోడు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సమానంగా విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.అదే తరహాలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి అజ్ఞాతవాసి చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ లో నటించాడు.
కానీ అజ్ఞాతవాసి అనుకోని విధంగా డిజాస్టర్ గా నిలవడంతో చిత్రం ఆది కి పెద్దగా కలిసి రాలేదు.
అయితే ఈ క్లాప్ చిత్రం ద్వారా కచ్చితంగా హిట్ కొట్టాలని ఆది పినిశెట్టి సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో పినిశెట్టి సరసన దేవదాసు చిత్రంలో నాగార్జున సరసన ఆడిపాడిన టువంటి ఆకాంక్ష సింగ్ నటిస్తోంది.ఈ చిత్రాన్ని మే నెలల్లో విడుదల చేసేందుకు చిత్ర దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.