మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు.వరుణ్ చేసిన సినిమాల్లో మెజారిటీ చిత్రాలు విజయాలు సాధించనవి కావడం విశేషం.
తనదైన యాక్టింగ్, డైలాగ్ డెలివరీలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు.
ఇటీవల గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వరుణ్ తేజ్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించేందుకు చాలా కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్.ఈ సినిమా కోసం ఇప్పటికే బాక్సింగ్‌లో స్పెషల్ ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్న వరుణ్ తేజ్, ఈ సినిమాలో నెవర్ బిఫోర్ లుక్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
అంతేకాదండోయ్, ఈ సినిమాలో మనోడు తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
దీనికోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా జిమ్‌లో కసరత్తు చేస్తున్నాడు.
ప్రస్తుతం వరుణ్ లుక్‌ను చూస్తే అతడు ఎంత కష్టపడుతున్నాడో ఇట్టే అర్ధం అవుతుంది.రగ్గడ్ లుక్‌లో వరుణ్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.
మరి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒరిజినల్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.