యూఎస్ కాంగ్రెస్ బరిలో భారత సంతతి వ్యక్తి మాథ్యూస్ పీటర్  

Indian-american Peter Mathews To Run For Us Congress-nri,peter Mathews,telugu Nri News Updates,us Congress,మాథ్యూస్ పీటర్

రత సంతతి అమెరికన్ పౌరుడు పీటర్ మాథ్యూస్ అమెరికా కాంగ్రెస్ బరిలో నిలవనున్నారు.మాథ్యూస్ భారత్‌లో జన్మించారు.ఆయన తండ్రి కేరళకు చెందిన వారు కాగా.తల్లి తమిళనాడు మహిళ.మాథ్యూస్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం భారత్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడింది.

Indian-American Peter Mathews To Run For US Congress-Nri Peter Telugu Nri News Updates Us Congress మాథ్యూస్ పీటర్

అక్కడే ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన సైప్రైస్ కాలేజీలో పొలిటికల్ సైన్సెస్‌తో పాటు అంతర్జాతీయ సంబంధాలపై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

దీనితో పాటు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ టెలివిజన్‌లో పొలిటికల్ ఎనలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.అప్పుడప్పుడు స్కై న్యూస్ యూకే, బీబీసీ రేడియోలలోనూ విశ్లేషణలు అందిస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని 47వ డిస్ట్రిక్ట్ నుంచి అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు మాథ్యూస్ ప్రకటించారు.రీగన్ ప్రారంభించి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ చేత పుంజుకున్న కార్పోరేట్ సడలింపు, పన్ను కోతలు ద్వారా ప్రజలను, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న స్వార్థపూరిత, స్వల్పకాలిక విధానాల పట్ల దూరంగా ఉండాలన్నారు.

తాను సభ్యుడిగా ఎన్నికైనట్లయితే మానవ సమానత్వం కోసం జీవితకాలం పోరాటం సాగిస్తానని ఆయన ప్రచారంలో చెబుతున్నారు.కాంగ్రెస్‌లో సభ్యుడు అయినా కాకపోయినా తాను జాతి, సమానత్వం, లింగం, జాతి, మతం, వయస్సు ఆధారంగా చూపే వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతానని మాథ్యూస్ స్పష్టం చేశారు.

.

తాజా వార్తలు

Indian-american Peter Mathews To Run For Us Congress-nri,peter Mathews,telugu Nri News Updates,us Congress,మాథ్యూస్ పీటర్ Related....