విడాకులు తీసుకున్న వృద్ధ జంట, 80 ఏళ్ల వయసులో

భార్య భర్తల బంధం యవ్వనం సమయంలో కంటే కూడా వృద్ధాప్యం సమయంలోనే వారి బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.ఇద్దరూ కూడా 60 లు దాటిన తరువాత ఒకరినొకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు.

 80 Years Couple Take Divorce In Madhurai Court-TeluguStop.com

ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాల్సిన ఒక జంట 80 ఏళ్ల వయసులో విడాకులు తీసుకోవడం విశేషం.ఈ ఘటన మధురై లో చోటుచేసుకుంది.

పలయం పట్టి కి చెందిన ఒక జంట సఖ్యత లేని కారణంగా గత 25 సంవత్సరాలుగా వేరు వేరుగానే ఉంటున్నారు.ఈ క్రమంలోనే వారు విడాకులు కోరడం తో దానిపై విచారించిన మదురై కోరు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది.

పలయం పట్టి కి చెందిన వేలుస్వామి(82),కస్తూరి(80) లు1962 లో పెళ్లి చేసుకున్నారు.అప్పుడు ఏర్పడిన వీరి పెళ్లి బంధానికి 2019 లో ఇద్దరూ ముగింపు పలికినట్లు తెలుస్తుంది.

వయసు పెరిగే కొద్దీ భార్య భర్తల మధ్య అనోన్యత పెరుగుతుంది,బంధం బలపడుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు.కానీ వీరి మధ్య మాత్రం మనస్పర్థలు పెరుగుతూ వస్తూ ఉండడం తో ఈ జంట కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకుంది.

అయితే ఇద్దరినీ కలపమని భార్య కస్తూరి కోరినప్పటికీ వేలుస్వామి ససేమిరా అనడం తో కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube