మోదీతో మరో వైసీపీ ఎంపీ భేటీ ? గోడ దూకేస్తారా ?

ఏపీ అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు.ఏపీలో ప్రతిపక్ష టీడీపీని కంగారు పెట్టుస్తూ ఆ పార్టీ నాయకులతో రాజీనామా చేయిస్తూ వస్తున్న వైసీపీని సొంత పార్టీ ఎంపీలే ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

 Ysrcp Mp Meet To Prime Minister Modhi-TeluguStop.com

కొద్ది రోజుల క్రితం నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మోదీతో భేటీ అవ్వడం , ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.దీంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్టే తగ్గి ఆ తరువాత బీజేపీ పార్లమెంటరీ ఆఫీస్ లో ప్రత్యక్షం అవ్వడం వైసీపీని ఆందోళనకు గురిచేసింది.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కలకలం రేపుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని, పొగాకు బోర్డు సభ్యుల నియామకంలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసేందుకు మాత్రమే ప్రధానిని కలిశానని ఆయన చెబుతున్నా విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా ఎవరూ మోదీ, అమిత్ షాలను కలవడానికి కుదరదని పార్లమెంట్‌ సమావేశాలకు ముందే ఎంపీలకు జగన్‌ వార్నింగ్ ఇచ్చినా ఇలా ఎవరూ లెక్కచేయకుండా బీజేపీతో టచ్ లోకి వెళ్లడం కలకకాలం సృష్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube