మెగాస్టార్ అనే బిరుదుని సంపాదించుకోవడానికి చిరంజీవి ఎన్నో కష్టాలు పడ్డాడు.తెలుగు ప్రజలు అన్నయ్య అనే స్థాయికి ఎదిగాడు.
సినిమా జీవితం అంటే పూల పాన్పు కాదు ఓ ముళ్ళ కంప అనేది ఒక్క మెగాస్టార్ కి మాత్రమే తెలుసు.మొదట అవకాశాల కోసం దర్శక నిర్మాతల కోసం తిరిగి, వచ్చిన అవకశాలను మంచిగా ఉపయోగించుకొన్ని విలన్ స్థాయి నుండి హీరో స్థాయికి ఎదిగాడు.
ఇప్పుడు దర్శక నిర్మాతలు మెగాస్టార్ డేట్స్ కోసం లైన్ కడుతారు.ఆ ఒక్క స్టార్ కష్టం వలన, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోస్ తెలుగు సినిమా ఇండస్ట్రి కి పరిచయం అయ్యారు.
అలా మొదలైన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను ఏడాది లో ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి అనాడు అంటే 1980 లో నటించిన తారలంత కలిసి ఓ గెట్ టు గెదర్ లాగా కలుసుకొన్ని ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు.అందుకోసం వీరు ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ అనే క్లబ్ ను పెట్టుకొన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక్క చోట కలసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.ఈ గ్రూప్ లో ఆనాటి తారలు అనగా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ లాల్ ప్రభు, సుమలత, అర్జున్, రమ్య కృష్ణ, రాధిక, సుమన్ బాగ్యరాజ్, శరత్ కుమార్ ఇంకా తదితరులు ఉన్నారు.ఈ గ్రూప్ లోని వారందరు ప్రతి ఏట పార్టీ ని ఎరంజ్ చేస్తూ వస్తున్నారు.
ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి చొప్పున పార్టీ ఇస్తూ వస్తున్నారు.ఈ ఏడాది చిరంజీవి వంతు వచ్చింది కావున అందుకు సంబంధించిన కార్యక్రమాలను చిరంజీవి మొదలు పెట్టేశాడు.అందుకోసం చిరంజీవి తన ఇంటిని రీ మోడలింగ్ చేయించి, ఆనాటి స్టార్స్ కు మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్నాడు.చిరంజీవి ఇచ్చే పార్టీ తో ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పదవ పార్టీ పూర్తి కానున్నది.