ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీడియో గేమ్! అభినందన్ వర్ధమాన్ గుర్తుగా

స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత యువతరం వీడియో గేమ్స్ లో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు.కొత్తగా మార్కెట్ లోకి ఎలాంటి గేమ్ వచ్చిన దానిని ఆడటం మొదలెట్టి అలా ఎడిక్ట్ అయిపోతున్నారు.

 Iaf Launches Mobile Game Indian Air Force A Cut Above-TeluguStop.com

అలా ఈ మధ్య కాలంలో భాగా పాపులర్ అయిన గేమ్ పబ్ జీ.ఈ గేమ్ కి ఇండియన్ యువత ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంది.ఇలా గేమ్స్ కి యువత కనెక్ట్ కావడంతో అలాంటి గేమ్స్ తోనే వారికి దేశ భక్తిని పెంచి, బాద్యతలని గుర్తుచేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధమైంది.అందులో భాగంగా గత ఏడాది పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఎయిర్ ఫోర్స్ సైనిక చర్యని గేమ్ కి డిజైన్ చేసి తీసుకొచ్చారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ ఫైట్ బ్యాటిల్ సిమ్యులేటర్ గేమ్ రిలీజ్ నేరుగా రిలీజ్ చేసింది.ఇండియాకి చెందిన గేమ్ డెవలపర్‌ సంస్థతో కలిసి ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్: ఎ కట్ ఎబౌ పేరుతో గేమ్ రూపొందించింది.ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ గేమ్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో వెయ్యి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.4.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా ఎయిర్ ఫైట్ గేమ్ రూపొందించడం విశేషం.ఈ గేమ్ ని అభినందన్ వర్ధమాన్ జెట్ ఎయిర్ ని ఎక్కడంతో మొదలుపెట్టి, ఆకాశంలో శత్రుసైన్యంపై దాడి చేయడం, ఉగ్రవాద స్థావరాలని ద్వసం చేయడం వంటివి ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube