ఒక కోతి మొత్తం ఊరినే ఖాళీ చేయించింది... కోతుల్లో ఈ కోతి వేరయ్య

మనిషి అల్లరి చిల్లరగా వ్యవహరిస్తూ ఉంటే కోతి చేష్టలు అంటూ వెక్కిరిస్తూ ఉంటారు.అయితే అన్ని కోతులు ఒకేలా ఉండవు.

 This Danger Monkey Gets Closes One Village Permanently-TeluguStop.com

కొన్ని కోతులు మంచిగా ఉంటాయి, మరి కొన్ని మాత్రం చిల్లర చేష్టలు చేస్తూ ఉంటాయి.తమిళనాడులోని ఒక గ్రామంను కోతి ఏకంగా ఖాళీ చేయించింది.

ఒక కోతి చేస్తున్న చేష్టలతో ఏకంగా ఆ గ్రామంలోని 60 కుటుంబాలు మొత్తం కూడా ఖాళీ చేసి పోయారు.నెల రోజుల్లోనే ఆ కోతి దాటికి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి.

మొత్తం గ్రామం కూడా ఖాళీ అయ్యింది.

ఈ కోతి రాక ముందు ఆ గ్రామం అంతా సంతోషంగా సాగింది.అయితే నెల రోజుల క్రితం ఒక కోతి వచ్చింది.ఆ కోతి రాకతో ఊరి జనాల పరిస్థితి మొత్తం మారిపోయింది.

కోతి రాకతో మెల్ల మెల్లగా జనాల్లో ఆందోళన ప్రారంభం అయ్యింది.కోతి మొదట ఇంట్లోకి దూరి మొత్తం అన్నం తినడంతో పాటు, మొత్తం ఆగం ఆగం చేస్తూ వచ్చేది.

ఆ తర్వాత కోతి చేష్టలు ప్రారంభించింది.కొన్ని రోజుల తర్వాత కోతి తినడం మాత్రమే కాకుండా జనాల మీదకు పడటం మొదలు పెట్టింది.

జనాల మీదకు పడి కొరుకుతూ, గాయపరుస్తూ వచ్చింది.దాంతో ఏం చేయాలో పాలుపోక జనాలు ఆ గ్రామాన్ని మొత్తం ఖాళీ చేశారు.

తాజాగా ఒక 70 ఏళ్ల ముసలమ్మను ఈ కోతి కరవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.ఆమె ప్రస్తుతం కోమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.కోమాలో ఉన్న ఆమె బతకడం కష్టం అంటూ వైధ్యులు చెబుతున్నారు.ఇంకా పలువురు కూడా కోతి వల్ల గాయాల పాలు అయ్యాయి.కోతిపై గ్రామస్తులు ఫిర్యాదుతో అటవి శాఖ రంగంలోకి దిగింది.కోతులను పట్టుకునేందుకు నిపుణులు రంగంలోకి దించారు.

అసలు కోతులు ఇలా ఇబ్బంది పెట్టడం చాలా అరుదు.కాని ఆ కోతి అతిగా ప్రవర్తిస్తుండటంతో దాని పరిస్థితి బాగాలేదమో అంటూ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం కోతి కోసం వేట కొనసాగిస్తున్నారు.ఊరు మొత్తం ఖాళీ అయ్యింది.

ఆ కోతిని పట్టుకున్న తర్వాత మళ్లీ గ్రామంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube