ఒకప్పుడు టాప్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ ను వివాహం చేసుకుంది.తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో నటించిన రంభ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైంది.
2016లో తన భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.ఈ కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేయడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో రంభ, ఆమె భర్త మాట్లాడుకొని, కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని రంభ కోర్టుకు తెలపడంతో జడ్జి విడాకుల కేసును మూసివేస్తున్నట్లుగా ఆ మధ్య ప్రకటించారు.ప్రస్తుతం తన భర్తతో కలిసి హ్యాపీగా ఉంటున్న రంభ త్వరలో మరో బేబీకి జన్మనివ్వబోతున్నారు.
త్వరలో మూడో బేబికి జన్మనివ్వబోతున్నానంటూ ఇటీవల తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు రంభ.ఇక సోమవారం నాడు రంభ సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు.ఈ వేడుకలో భార్యా భర్తలు ఇద్దరూ ఆనందంగా పాల్గొన్నారు.
రంభపై ఆమె భర్త పూల వర్షం కురిపించగా.సంతోషంగా ఉన్న రంభ తన బంధువులతో కలిసి స్టెప్పులు వేశారు.
ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌గా ద్వారా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
watch video:
రంభకి ప్రస్తుతం లాన్య(7), శాషా(3) అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా, త్వరలో వారింట మరో బేబి అడుగుపెట్టనుంది.రంభ భర్త ఆమెపై పూల వర్షం కురిపించారు.