ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో కూడా తెలియందటారు కదా.! సేమ్ టు సేమ్ ఈ యువతి లవ్ స్టోరీ కూడా అలాంటిదే… సుఖాంతంగా ముగిసిన ఈ 24 ఏళ్ళ యువతి లవ్ స్టోరిని ఆమె మాటల్లోనే విందాం.!
“మా ఇళ్ళు గంగా నదికి దగ్గర్లో ఉండేది.నా చిన్నప్పటి నుండి రోజూ ఉదయం నా స్నేహితురాళ్ళతో కలిసి ఆ నది ఒడ్డునే స్నానం చేసేదానిని…ఎప్పటిలాగే ఓ రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి స్నానానికి వెళుతున్న క్రమంలో నదికి దగ్గర్లో ఉండే షాప్ లో ఓ వ్యక్తి కనిపించాడు…అతడు ఆ షాప్ లో పనిచేయడానికి కొత్తగా వచ్చిన కుర్రాడు.
చూడగానే చాలా నచ్చాడు…ఎంతగా అంటే అతను నాకోసమే పుట్టాడా.? అన్నంతగా.! అలా కొన్ని రోజుల పాటు అతనిని చూస్తూ నదికి వెళ్ళేదానిని…అలా మొదలైంది నా కనుసైగల ప్రేమ అతనిమీద.
రోజూ నేను అతనిని చూడడం, అతను నన్ను చూడడం, కనుసైగలతోనే నవ్వుకోవడం జరుగుతున్నాయి.అవసరం లేకున్నా ఆ షాప్ లోకి వెళ్ళి ఏవేవో సరుకులు తీసుకునేదానిని…అతనిని ఎక్కువ సేపు చూడొచ్చన్న కారణంతో.! కొన్ని రోజులైతే రోజుకు 4-5 సార్లు స్నానానికి నదికి వెళ్లేదానిని ఆ దారిలో అతడిని చూడొచ్చన్న ఉద్దేశ్యంతో……ఈ క్రమంలోనే ఓ రోజు అతని దగ్గరికి వెళ్ళా.
నాలోని ప్రేమను అతనితో చెప్పాలన్న ఉద్దేశ్యంతో…కానీ ఆశ్చర్యంగా అతడే నాకు ఐ లవ్ యూ చెప్పేశాడు.పెళ్ళికి రెడీ అయ్యాం.ఇంట్లో చెబితే అమ్మానాన్న ఇద్దరూ తిట్టారు…కుదరదు అన్నారు.అయినా వెయిట్ చేశాం…మా మా బాధ్యతలు నెరవేరుస్తూనే మా ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం.
ఫైనల్ గా 2 సంవత్సరాల తర్వాత మా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకున్నారు.ఇప్పుడు మాకు ఓ పాప పుట్టింది…ఆమె పేరేంటో తెలుసా.
స్వేచ్ఛ.! మా ఆయన నేను చాలా హ్యాపీ.
”