అమెరికాలో ఏపీ “మహిళా ఎన్నారై” కి అరుదైన గుర్తింపు

అమెరికాలో ఎన్నో రంగాలలో ఎంతో మంది ఎన్నారై లు తమ ప్రతిభకి తగ్గట్టుగా అవకాశాలని పొందుతూ మెల్ల మెల్లగా ఉన్నట్ట సిఖరాలని అధిరోహిస్తున్నారు.ముఖ్యంగా భారతీయులు ఈ విషయంలో ముందు వరసలో ఉన్నారు…భారతీయులు ప్రదర్శించే ఎంతో చక్కని ప్రతిభ కారణంగా ప్రపంచ దేశాలలో సైతం ఎంతో చక్కగా రాణిస్తున్నారు.

 Ap Women In America-TeluguStop.com

ఉన్నతమైన భవిష్యత్తు దిశగా దూసుకు వెళ్తున్నారు.

తాజగా ఏపీ కి చెందినా మహిళా ఎన్నారై కి అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లూయివిల్‌ లో అరుదైన గుర్తింపు లభించింది.అంధ్రప్రదేశ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ లో ఎంబీయే చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా అమెరికాలోని లూయివిల్‌ యూనివర్శిటీ కి ప్రెసిడెంట్ అయ్యింది.వివరాలలోకి వెళ్తే .అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లూయివిల్‌ 18వ అధ్యక్షురాలిగా ప్రవాసాంధ్ర మహిళ డాక్టర్‌ నీలిమ బెండపూడి నియమితులయ్యారు…ఏపీకి చెందిన ఆమె ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడి పోయింది.

అమెరికాలో పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులు అధిరోహించారు.

అంచెలంచెలుగా ఎదుగుతూ లూయివిల్‌ యూనివర్శిటీ ప్రథమ మహిళా ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు.అయితే తోటి ఎన్నారై ఒక యూనివర్సిటీ కి అధ్యక్షురాలిగా ఎన్ని అవ్వడంతో అక్కడే ఉంటున్న తెలుగు ఎన్నారై సంఘాలు ఆమెని ఘనంగా సత్కరించారు.

ఆంతేకాదు ఆమెకి కెంటకీ తెలుగు సంఘం గౌరవ సభ్యత్వాన్ని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube