జెమిని గణేషన్‌కు మొత్తం ఎంత మంది పిల్లలో తెలిస్తే షాక్‌

తమిళనాట స్టార్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న జెమిని గణేషన్‌ ఒక ఉమనైజర్‌ అనే ముద్రతో తుది దశలో తనవు చాలించాడు.ముగ్గురిని పెళ్లి చేసుకోవడంతో పాటు, ఎంతో మందితో అక్రమ సంబంధాలను ఆయన పెట్టుకున్నాడు అంటూ ఇప్పటికి తమిళనాట కొందరు అంటూ ఉంటారు.

 Gemini Ganesan Controversial Affairs-TeluguStop.com

కొందరితో వివాహం కాకుండనే సహజీవనం సాగించాడు, మరి కొందరు ఆయనతో సంబంధం ఉందని చెప్పడానికి ముందుకు రాలేదు.జెమిని గణేషన్‌ గురించి ‘మహానటి’ ముందు వరకు తెలుగులో ఏ ఒక్కరికి తెలియదు.

కాని సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’ విడుదలైన తర్వాత జెమిని గణేషన్‌ గురించి తెలిసింది.
జెమిని గణేషన్‌ను కొందరు ఉమనైజర్‌ అంటూ విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఆడు మగాడ్రా బుజ్జి అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

మొత్తానికి జెమిని గణేషన్‌ గురించి ప్రస్తుతం తెగ చర్చ జరుగుతుంది.ఆయన గురించి తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు.ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసుకున్న పెళ్లిలు, ఆయన పిల్లల గురించి సెర్చ్‌ చేస్తున్నారు.తాజాగా ఒక ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

జెమిని గణేషన్‌ ముగ్గురు భార్యలకు చెందిన పిల్లలు ఇప్పటికి కొన్ని సందర్బాల్లో కలుస్తారని, వారు అప్పుడప్పుడు ఫంక్షన్స్‌ పార్టీల్లో కలిసి వేడుకలు చేసుకుంటారు అంటూ ఆ ఫొటో చూస్తుంటే అర్థం అవుతుంది.

జెమిని గణేషన్‌కు ఏడుగురు కూతుర్లు, ఒక కొడుకు.ఆ కొడుకు సావిత్రికి జన్మించిన వ్యక్తి.మొదటి భార్యకు ఇద్దరు కూతుర్లు కాగా, రెండవ భార్యకు ఇద్దరు కూతుర్లు, సావిత్రికి ఒక కుమార్తే అనే విషయం తెల్సిందే.

ఈ లెక్కన చూసుకుంటే ఆయనకు అయిదుగురు కూతుర్లు.అయితే మరో ఇద్దరు కూతుర్లు ఎలా అనే విషయం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.మరో ఇద్దరు ముగ్గురితో కూడా జెమిని గణేషన్‌ సహజీవనం సాగించాడు.వారి ద్వారా కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇలా మొత్తం ఏడుగురు అమ్మాయిు ఒక కొడుకు జెమిని గణేష్‌కు ఉన్నట్లుగా అధికారిక సమాచారం.అయితే అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరితో పాటు మరో నలుగురు కూడా జెమిని గణేష్‌ అకౌంట్‌లో జన్మించినట్లుగా చెబుతున్నారు.

అంటే మొత్తంగా 12 మందికి జెమిని గణేషన్‌ జన్మనిచ్చినట్లుగా చెప్పుకోవచ్చు.ఈ సంఖ్య చాలదు ఆయన ఉమనైజర్‌ అని చెప్పడానికి.ఆయన గొప్ప నటుడు అయ్యి ఉండవచ్చు, కాని అతడో ఉమనైజర్‌ అని మాత్రం చెప్పక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube