కెరీర్ ఆరంభం నుండి స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనుష్క ‘అరుంధతి’ చిత్రంతో స్టార్ హీరో రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుంది.అప్పటి నుండి కూడా ఈమె నటించిన ప్రతి సినిమాకు భారీ పారితోషికం పుచ్చుకుంటూ వచ్చింది.
ఇక ఈమె నటించిన ‘బాహుబలి’ సినిమా దేశ వ్యాప్తంగా అద్బుతమైన ప్రజాధరణ పొందిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈమెకు మరింతగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు.అయితే బాహుబలి సమయంలోనే చేసిన ‘సైజ్ జీరో’, బాహుబలి తర్వాత చేసిన ‘భాగమతి’ చిత్రాలు ఈమె కెరీర్‌ను కిందకు దిగజార్చాయి.
ఆ రెండు సినిమాలు కూడా చెత్త టాక్ తెచ్చుకోవడంతో ఈమె పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.
సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ఆ బరువును తగ్గేందుకు చాలా సమయం తీసుకుంది.ఇంకా కూడా పూర్తి స్థాయిలో అనుష్క బరువు తగ్గలేదని చెప్పుకోవచ్చు.దాంతో ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
స్టార్ హీరోల సరసన ఈమెకు నటించే అవకాశం దక్కడం లేదు.సోలో హీరోయిన్‌గా చేసిన సినిమాలు సక్సెస్‌ను తెచ్చి పెట్టడం లేదు.
దాంతో మళ్లీ మొదటి నుండి కెరీర్‌ను మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది.అందుకే చిన్న సినిమాలను, చిన్న హీరోలతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
గతంలో గోపీచంద్‌కు జోడీగా రెండు చిత్రాల్లో నటించిన అనుష్క మరోసారి ఆయనతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కెరీర్ ఆరంభంలో గోపీచంద్‌తో ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమాల్లో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.తాజాగా వీరిద్దరి కాంబోలో మరో సినిమాకు నానువ్వే దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.
సినిమాలో పెద్దగా ఆఫర్లు లేని అనుష్క గోపీచంద్ సరసన అన్నప్పుడు కాస్త ఆలోచించిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సరసన నటించి మళ్లీ తన సత్తా చాటాలని భావించింది.అందుకే గోపీచంద్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జులై నుండి వీరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.
ఇటీవలే తమిళంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఈ అమ్మడు ఓకే చెప్పింది.
ఆ సినిమా భారీ స్థాయిలో తెలుగు మరియు తమిళంలో తెరకెక్కించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ఆ సినిమాకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈలోపుగా గోపీచంద్‌తో సినిమాను పూర్తి చేయాలని అనుష్క భావిస్తుంది.మళ్లీ మొదటి నుండి స్టార్ట్ చేసిన అనుష్కకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతాయా, లేదంంటే ఒకటి రెండు సంవత్సరాలు చూసి అనుష్క దుఖాణం సర్దేస్తుందా అనేది చూడాలి.
మొత్తానికి అనుష్కకు ప్రస్తుతం గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు.