GST ఎఫెక్టు సినిమా ఇండస్ట్రీపై కూడా భారీగానే పడనుంది.ప్రస్తుతం ఉన్న తక్కువ ట్యాక్స్ లాభాల్ని పొందే చివరి పెద్ద సినిమా డీజేనే.
ఇకనుంచి వచ్చే చిత్రాలకి కొన్ని ఇబ్బందులు తప్పవు.అందుకే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికేట్ రేట్లపై ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది.GHMC పరిథిలోకి వచ్చే సింగల్ స్క్రీన్స్ లలో బాల్కని టికేట్ రేటు రూ.120 దాకా పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.ఇది నిర్మాతలకు, బయ్యర్లకు మంచి వార్తే కాని ప్రేక్షకులకి కాదు (ఎందుకు ఎలా అనే విశ్లేషణ చివర్లో).ఇక మల్టిప్లెక్స్ అడియెన్స్ పై మరింత భారం పడనుంది.హైదరాబాద్ మల్టిప్లెక్స్లలో రెగ్యులర్ రేటు రూ.200 కానుంది.అంటే ఒక్కసారిగా రూ.50 పెంపు.3D సినిమాల టికెట్ కి ఎంతలేదన్నా రూ.225 పెట్టాల్సిందే.ప్రసాద్ మల్టిప్లెక్స్ లోని లార్జ్ స్క్రీన్ టికేట్ రూ.300 దాటేయనుంది.ఇక మల్టిప్లెక్సులో రిక్లైనర్ సీటు కావాలంటే రూ.300 చెల్లించాల్సిందే.
తెలంగాణలో కొత్త టికేట్ రేట్లు ఇలా ఉండబోతున్నాయి.
హైదరాబాద్ పరిథిలోని సింగిల్ స్కీన్స్ (అత్యధిక ధర – Maximum price)
ఏసి థియేటర్స్ :
బాల్కని – రూ.120 లోయర్ క్లాస్ – రూ.40
నాన్ ఏసి థియేటర్స్ :
బాల్కనీ – రూ.60లోయర్ క్లాస్ – రూ.20
మున్సిపాలిటీలు :
ఏసి థియేటర్స్ :
బాల్కని – రూ.80లోయర్ క్లాస్ – రూ.30
నాన్ ఏసి థియేటర్స్ :
బాల్కనీ – రూ.60లోయర్ క్లాస్ – రూ.20
పంచాయితీలు :
ఏసి థియేటర్స్ :
బాల్కని – రూ.70లోయర్ క్లాస్ – రూ.20
నాన్ ఏసి థియేటర్స్ :
బాల్కనీ – రూ.50లోయర్ క్లాస్ – రూ.15
ఈ టికేట్ రేట్స్ అన్ని కూడా 18% GSTతో పాటు ఇతర ఛార్జీలు (ఆన్ లైన్ బుకింగ్ ఛార్జీలు కావు) కలుపుకోని ఉన్నవే.దాంతో నిర్మాత/డిస్ట్రీబ్యూటర్ ఈ రూ.120 నుంచే ప్రభుత్వానికి 18% (రూ.21.60) చెల్లిస్తాడు.రూ.98.40 రూపాయలు నెట్ వస్తుంది.అదే టికేట్ రేటు రూ.120 కి మించి ఉంటే, GST రూల్స్ ప్రకారం 28% ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.ఈరకంగా నిర్మాతలకి – డిస్ట్రీబ్యూటర్స్ కి తగ్గట్టుగా టికెట్ రేట్లలో మార్పులు చేసింది ప్రభుత్వం.
కాని సింగల్ స్కీన్ ప్రేక్షకుడు సినిమా చూడాలంటే ఓ ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టాల్సిందే, అయితే మల్టిప్లెక్స్ జనాలు కనీసం 50 రూపాయలు ఎక్కువ కట్టాల్సిందే.