బాబు స‌హ‌క‌రించట్లే... గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ ఫిర్యాదు

హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి సదానంద వ్యాఖ్యలు సంచ‌ల‌నం సృష్టిస్తున్న క్ర‌మంలో ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశం కావ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

 Kcr Complaint To Governor On Chandrababu-TeluguStop.com

న్యాయాధికారుల నియామ‌కాలు ఇష్టానుసారంగా చేయ‌టంతో తెలంగాణ న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతోంద‌ని, ప‌రిస్థితి చ‌క్క‌దిద్దేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హ‌క‌రించ‌డంలేదంటూ ప్ర‌స్తుత‌ తాజా పరిణామాలను గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించిన‌ట్టు స‌మాచారం.

అయితే చట్టంలో లోపాలు ఉన్నాయని తాము ఆనాడే చెపితే తాము తెలంగాణ రాకుండా అడ్డుప‌డుతున్నామ‌ని, విభజనచట్టంలో ప్రతి అంశం తనకు చెప్పే రాశారని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు నెపం చం్ర‌ద‌బాబుపై నెట్టేయాల‌ని చూడ‌టం స‌రికాద‌ని తెలుగుదేశం నేత‌ రావుల చంద్ర‌శేఖ‌ర్, టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.హైకోర్టు విభజనకు అభ్యంతరం లేదని 2015 మార్చిలోనే సీజేఐకి చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు.

అయితే .సెక్షన్ 31(2), 94(3) ప్రకారం హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే అయినా సెక్షన్ 31 సవరణ చేయాలని కేసీఆర్ ఇప్పుడు చెబుతున్నారని మండిపడ్డారు.టీఆర్ఎస్ ప్ర‌తి అంశం నుంచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందనేందుకు ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ అని అన్నారు.

ఇంకో వైపు కాం్ర‌గెస్ సైతం హైకోర్టు విభజనపై కేసీఆర్ తీరును త‌ప్పు ప‌ట్టింది.

హైకోర్టు విషయంలో రెచ్చగొట్టేలా ఇరు రాష్ట్రాల సీఎంల తీరు ఉందని కాం్ర‌గెస్ నేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.ఆంధ్రాలో ఖాళీలు ఉన్నా.తెలంగాణ ఆప్షన్‌ కోరుకోవడం వ‌ల్ల‌నే స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయ‌ని, ్ర‌పాధ‌మిక నియామ‌కాల‌పై చేస్తున్న అభ్యంత‌రాల‌ను స‌రి చేయాల్సిన హైకోర్టు తెలంగాణ‌లో జడ్జిల సస్పెన్షన్ చేయ‌టంతో ఆజ్యం పోసిన‌ట్ట‌య్యింద‌న్నారు.తెలంగాణలో న్యాయాధికారులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరమని, న్యాయాధికారులు ఆప్పన్స్‌పై కేసీఆర్ గతంలోనే కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని జీవన్‌రెడ్డి నిల‌దీసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube