తుని ఘ‌ట‌న కి వైకాపా నేతల అరెస్ట్ ..!

ఓ వైపు కాపునాడు సార‌ధ్య నేత ముద్రగడ ప‌ద్మ‌నాభం మ‌లి పోరాటం పేరుతో ఎక్కేగ‌డ‌పా, దిగే గ‌డ‌ప అన్న‌ట్టు కాంగ్ర‌స్‌, వైకాపా నేత‌లంద‌రి ఇళ్ల‌కీ వెళ్లి మ‌ద్ధ‌తు కూడ గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటే, తుని కాపు గర్జన ఘటనలో అరెస్టులు ప్రారంభించించారు సీబీసీఐడీ పోలీసులు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 మందిని సోమ‌వారం పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టంతో కొంద‌రు నేత‌ల‌లో గుబురు ప్రారంభ‌మైంది.

 Cbcid Start Arests In Train Burning Case-TeluguStop.com

పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే అరెస్టులు ఉంటాయంటూ తెలుగుదేశం పార్టీ ఎపి అధ్య‌క్షుడు కిమిడి కళా వెంకట్రావు ప్ర‌క‌టించిన కొద్ధ‌రోజుల‌కే ఈ అరెస్టులు ప్రారంభం కావ‌టంతో ద‌ర్యాప్తు తుదిద‌శ‌కు చేర‌కుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.తుని ఘ‌ట‌న ఉద్దేశ‌పూర్వ‌కంగా వైకాపా చేసిందంటూ తెలుగుదేశం నేత‌లు ప‌దే ప‌దే ఆరోపిస్తున్న నేప‌ధ్యంలో దీక్ష విర‌మ‌ణ స‌మ‌యంలో త‌న‌ని క‌ల‌పిన మంత్ర‌లు బృందానికి తుని ఘ‌ట‌న‌లో అరెస్టులు కూడ‌ద‌ని పెద్ద‌హామీనే ముందుచారు ముద్రగడ.

అయితే మాట చెల్లుబాటయ్యినట్టు కనిపించడం లేదు.తుని ఘటనలో కొందరు బయటి వ్యక్తులు ఉన్నారని, వారిని వదిలిపెట్టమంటూ స్ప‌ష్టం చేసిన ప్ర‌భుత్వం సీబీసీఐడీకి కేసు అప్ప‌గించింది.

సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టులు చేస్తున్నారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమ నేత ముద్రగడ దీక్ష స‌భ నుంచి చేసిన ప్ర‌సంగం ఆందోళనను హింసాయుతంగా మార్చేసింది.

రైల్‌రోకో పిలుపుతో గుర్తు తెలియని వ్యక్తులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు ను చేసిన సంగతి తెలిసిందే.ప్రయాణికులు భయాందోళనలకు గురై ప‌రుగులు తీయ‌గా, 14 రైలు బోగీలతో సహా రైలు మొత్తం దగ్ధమైంది.

ఆందోళ‌న కారుల‌ను నిలువ‌రించిన , రైల్వే పోలీసు సిబ్బందితో పాటు చిత్రీక‌రించేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు.ఈ దాడిలో కెమెరాలు సైతం ధ్వంసమయ్యాయి.

ఇదంతా గ‌తం.

తుని ఘ‌ట‌న విష‌య‌మై అటు రైల్వే శాఖ కూడా సీరియ‌స్‌గ‌నే తీసుకుంది.

ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, తునిలో కాపు నేతల బస తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించి ఎట్టకేలకు హింసకు పాల్పడ్డ నిందితులను గుర్తించారు.వీరి వెనుక‌రాజకీయ నేతలు కూడా ఉన్నారని వారి సూచ‌న‌ల మేర‌కే దాడులు జ‌రిగిన‌ట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించి సమగ్ర నివేదికను సీఐడీ ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.

ఈ నివేదికను పరిశీలించిన మీదటే ప్రభుత్వం నిందితుల అరెస్ట్ కు సీఐడీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విన‌వ‌స్తోంది.

గ‌త కొంత కాలంగా ఈ ఘ‌ట‌న వెనుక వైకాపా నేత‌లున్నారని, ముద్ర‌గ‌డ‌తో వారే ట‌చ్‌లో ఉండి త‌మ వారితో ప్ర‌సాంత‌త‌కు నెల‌వైన జిల్లాలో హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లెంత వ‌ర‌కు వాస్త‌వ‌మ‌న్న‌ది మ‌రి రెండు మూడు రోజుల‌లో తేలిపోనుంది.

కాగా ఈ ఘ‌ట‌న‌ని అడ్డు పెట్టుకుని ప‌లు ప్రాంతాల‌లో వైకాపా నేత‌ల‌ను తెలుగుదేశం ప్ర‌భుత్వం అరెస్టు చేయిస్తుంద‌న్న వాద‌న‌లూ ఊపందుకుంటున్నాయి.వేచి చూద్దాం ఏం జ‌ర‌గ‌నుందో?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube