పుష్ప ది రైజ్ సక్సెస్ వల్ల అల్లు అరవింద్ కు రూ.9 కోట్ల నష్టమట.. అసలేమైందంటే?

బన్నీ హీరోగా సుకుమార్  డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ యావరేజ్ టాక్ తో ఇండస్ట్రీ హిట్ సినిమాల స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా సినిమా బడ్జెట్ ఎక్కువ మొత్తం కావడంతో నిర్మాతలకు లాభాలు ఆశించిన స్థాయిలో రాలేదని తెలుస్తోంది.

 9 Crore Rupees To Stop Hindi Dubbing In Ala Vaikunthpauramulo Details Here , Ala-TeluguStop.com

అయితే ఈ సినిమా సక్సెస్ వల్ల అల్లు అరవింద్ కు మాత్రం 9 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సమాచారం.

పుష్ప ది రైజ్ సక్సెస్ తో బాలీవుడ్ లో బన్నీకి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.

ఈ సినిమా సక్సెస్ వల్ల బాలీవుడ్ లో అల  వైకుంఠ పురములో తెలుగు వెర్షన్ ను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి.హిందీ అల  వైకుంఠపురములో టీజర్ కూడా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

అల  వైకుంఠపురములో డబ్బింగ్, రీమేక్, శాటి లైట్ హక్కులు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనీష్ కొనుగోలు చేశారు.

Telugu Allu Aravind, Allu Arjun, Bollywood, Bunny, Hindi, Manish, Pushpa, Tollyw

అయితే అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావించిన అల్లు అరవింద్ ఈ సినిమా రీమేక్ హక్కులను మనీష్ నుంచి 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.అయితే పుష్ప విజయం తర్వాత మనీష్ అల వైకుంఠపురములో డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు.హిందీలో అల్లు అరవింద్ కార్తీక్ ఆర్యన్ తో షెహజాదా పేరుతో అల వైకుంఠపురములో రీమేక్ చేస్తున్నారు.

Telugu Allu Aravind, Allu Arjun, Bollywood, Bunny, Hindi, Manish, Pushpa, Tollyw

అల్లు అరవింద్ మనీష్ ను కలిసి అల వైకుంఠపురములో డబ్బింగ్ రిలీజ్ చేయవద్దని కోరగా మనీష్ 9 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆ మొత్తం చెల్లించి అల్లు అరవింద్ అల వైకుంఠపురములో థియేట్రికల్ రిలీజ్ ను ఆపారని సమాచారం.మనీష్ తెలివిగా అల వైకుంఠపురములో హిందీ హక్కులతో కోట్ల రూపాయలు సంపాదించడం గమనార్హం.పుష్ప సక్సెస్ ఊహించని విధంగా అల్లు అరవింద్ కు నష్టాలను తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube