అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ: వాషింగ్టన్‌లో ఉన్మాది ఘాతుకం .. ముగ్గురి మృతి

ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.పోలీసులు ఎంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నా అమెరికాలో నిత్యం తుపాకీ కాల్పులు చోటు చేసుకుంటూనే వున్నాయి.

 3 Dead, 3 Injured In Washington, D.c., Shooting, Washington, Dc Shooting, Americ-TeluguStop.com

కరోనా వైరస్ వల్ల గతేడాది ఉన్మాదులు బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో ప్రజలు, పోలీసులు ప్రశాంతంగా వున్నారు.ఎప్పుడైతే ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిందో నాటి నుంచి అమెరికాలో మళ్లీ తుపాకీ కాల్పులు నిత్యకృత్యమయ్యాయి.

తాజాగా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన కాల్పుల ఘటన లో ముగ్గురు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.

వాయువ్య వాషింగ్టన్‌లోని ఒక వీధిలో శనివారం రాత్రి ఓ వ్యక్తి కారులోంచి ఒక గుంపుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.

ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

మరణించిన వారంతా యువకులేనని మెట్రోపాలిటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ రాబర్ట్ కాంటీ మీడియాకు తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుందని కాంటీ చెప్పారు.

ఈ దాడిలో నిందితుడు ఉపయోగించిన వాహనం తాలూకు ఛాయాచిత్రాలను దగ్గరలోని సీసీ కెమెరా నుంచి సేకరించినట్లు కాంటీ తెలిపారు.

Telugu Washington, America, Americangun, Cc Camera, Dc, Gun, Telugu Nri-Telugu N

సదరు వాహనంలో ఎంతమంది అనుమానితులు వున్నారని.ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు కలిసి ప్రజలపై కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు.అయితే వాహనంలో వున్న వారికి బాధితులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు కాంటీ చెప్పారు.

ఘటనాస్థలిలో తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే .ధైర్యంగా ముందుకు వచ్చి తమకు సహకరించాల్సిందిగా కాంటీ కోరారు.గన్ కల్చర్‌పై ఆయన మాట్లాడుతూ… ఇది ఒక్క వాషింగ్టన్‌కు మాత్రమే పరిమితం కాలేదన్నారు.

అమెరికన్ సమాజం మొత్తం తుపాకీ హింసకు గురైందని కాంటీ ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube