అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.పెన్సిల్వేనియా( Pennsylvania ) రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం పాలైంది.
మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు.మార్చి 21న ఈ ప్రమాదం జరిగినట్లు న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శనివారం ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.
ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అర్షియా జోషి( Arshiya Joshi ) గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
జోషి కుటుంబంతో, స్థానిక ఇండియన్ కమ్యూనిటీతో టచ్‌లో వున్నామని కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.అర్షియా జోషి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నామని కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.
ఎన్జీవో సంస్థ ‘‘ TEAM Aid ’’ జోషి భౌతికకాయాన్ని న్యూఢిల్లీలో( New Delhi ) వున్న ఆమె నివాసానికి పంపేందుకు సహాయం చేస్తోంది.ఈ సంస్థ విదేశాలలో ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు, ఆకస్మిక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సమాజానికి సహాయం చేసేందుకు కృషి చేస్తోంది.ముఖ్యంగా అమెరికాలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల మృతదేహాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి టీమ్ ఎయిడ్ సహాయం చేస్తోంది.టీమ్ ఎయిడ్ వ్యవస్థాపకుడు మోహన్ నన్నపనేని( Mohan Nannapaneni ) మాట్లాడుతూ.
వరుస విషాద ఘటనలు తమను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయన్నారు.గడిచిన వారం రోజుల వ్యవధిలో టీమ ఎయిడ్ ఐదుగురి భౌతికకాయాలను భారతదేశానికి పంపిందని , స్థానికంగా ముగ్గురికి అంత్యక్రియలు నిర్వహించిందని మోహన్ పేర్కొన్నారు.
వీరిలో న్యూమెక్సికోలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లు కూడా వున్నారు.వారి అవశేషాలను పంజాబ్‌కు తరలిస్తున్నారు.వాషింగ్టన్‌లోని సీటెల్‌లో( Seattle, Washington ) 25 ఏళ్ల భారతీయ విద్యార్ధి తన అపార్ట్మెంట్లో శవమై కనిపించగా, అతని భౌతికకాయాన్ని బెంగళూరుకు తరలిస్తున్నారు.కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ప్రాణాలు కోల్పోయిన 38 ఏళ్ల రెస్టారెంట్ చెఫ్ భౌతికకాయాన్ని కోల్‌కతాకు పంపుతున్నట్లు మోహన్ నన్నపనేని వెల్లడించారు.
నన్నపనేని అతని బృందం ప్రస్తుతం అమెరికా, కెనడాలలో మరణించిన వారి మృతదేహాలను భారతదేశానికి పంపడంలో అనేక కుటుంబాలకు సహాయం చేస్తున్నారు.