రాజధాని శంకుస్థాపన కోసం తనకు ఆహ్వాన పత్రిక పంపవద్దంటూ ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.ఆహ్వానం పంపించినా తాను రాలేదన్న బండ తనమీద విసరవద్దని జగన్ ఆ లేఖలో తెలిపారు.
తనకు ఆహ్వానం పంపి ఆ తర్వాత రాలేదని తన మీద నిండా వేయొద్దని జగన్ లేఖలో కోరారు.మీరు, మీ ఆదేశాల మేరకు మీ అరడజను మంది మంత్రులు చేయబోయేది ఇదేనని ఈపాటికే తనకు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు
ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కొని, వారి ఉసురు మీద మీరు రాజధాని నిర్మిస్తున్నారని జగన్ ఆరోపించారు.
మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట రైతుల మెడమీద కత్తిపెట్టి లాక్కున్న వైఖరికి వ్యతిరేకంగా మీ తీరు మారలేదు అని అందుకే రాదలచుకోలేదు అని జగన్ తెలిపారు.
ప్రజల డబ్బును దుబారా చేస్తూ ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు ప్రజల డబ్బు దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్న తీరుకు నిరసనగా రావట్లేదని జగన్ తెలిపారు.అంతేకాదు రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు అని జగన్ తెలిపారు.
జగన్ రాసిన లేఖ వివరాలు