వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విడుదల వాయిదా..!!

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొన్ని మీడియా సంస్థలతో కుట్ర చేసిన్నట్లు ఎఫ్ఐర్ నమోదు చేసి ఏసీబీ అరెస్టు చేయటం తెలిసిందే.ఇదిలా ఉంటే మే 21 వ తారీఖు సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు కి బెయిల్ ఇవ్వడం జరిగింది.

 Ycp Mp Raghurama Krishnamraju Release Postponed , Cid, Ysrcp, Raghuramakrishnam-TeluguStop.com

అంతకముందు కోర్ట్ ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో రఘురామకష్ణంరాజు ఉండటం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉండగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోగ్యపరిస్థితిపై తాజాగా సిఐడి న్యాయస్థానం డిశ్చార్జి సమ్మరీ  కోరడంతో .మొత్తం వివరాలు ఇవ్వటానికి నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం ఉందంట.

దీంతో నాలుగు రోజుల తర్వాత రఘురామకృష్ణంరాజు బెయిల్ పై బయటకు రానున్నారట.

 ఈ పరిణామంతో RRR విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది.ఇదే టైం లో ట్రైల్ కోర్టులో  రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు మళ్లీ పూచీకత్తు సమర్పించనున్నారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రఘురామకృష్ణం రాజు గుండెకి  శస్త్ర చికిత్స జరగటం తో పాటు కాలి  కి గాయాలు కావడంతో సుప్రీంకోర్టు మే 21వ తారీకు బెయిల్ ఇవ్వడం జరిగింది.కానీ మరోపక్క సిఐడి విచారణ యధావిధిగా సాగాలని కూడా తెలిపింది.

బెయిల్ పై బయటకు వచ్చాక  రఘురామకృష్ణంరాజు సోషల్ మీడియా.ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వటం మాత్రమే గాక మాట్లాడకూడదని.

కోర్ట్ షరతులు విధించింది.గతంలో మీడియాకు చూపించిన మాదిరిగా గాయాలు చూపించకూడదని సూచించింది.

అదేవిధంగా విచారణ చేయాలనుకున్న సమయంలో సరిగ్గా 24 గంటల ముందు రఘురామకృష్ణంరాజు కి ముందే నోటీసులు ఇవ్వాలని సిఐడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube