జ‌గ‌న్‌ను ముంచేస్తున్న వైసీపీ నేత‌లు

గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు.2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా అక్క‌డ సీట్లు సాధించాల‌ని ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు.ఇందుకు అనుగుణంగా ఏ చిన్న అవ‌కాశం ద‌క్కినా దానిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు.అయితే జగ‌న్ ప్ర‌య‌త్నాల‌కు ఆ పార్టీ నేత‌లే గండి కొడుతున్నారు.అధినేతకు త‌ప్పుడు స‌మాచారం ఇస్తూ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌కుండా అడ్డుప‌డు తున్నారు.

 Ycp Leaders Wrong Guidance To Jagan-TeluguStop.com

దీనికి గ‌ర‌గప‌ర్రు గ్రామాన్ని జ‌గ‌న్‌ ప‌ర్య‌టించ‌క‌ముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌లే ఉదాహ‌ర‌ణ‌! పార్టీ అధినేత స్వ‌యంగా ప‌ర్య‌టిస్తానంటే.అక్క‌డ ప‌రిస్థితులు ప్ర‌శాంతంగా ఉన్నాయ‌ని చెప్పార‌ట‌.

కానీ వాస్త‌వాల‌ను చూసి అవాక్క‌య్యార‌ట‌.

పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామాన్ని జగన్ సందర్శించారు.

అక్కడ గ్రామ బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు.జగన్ పర్యటన ఖరారు కాకముందు నుంచే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలు ఇక్కడకు రావద్దని సమాచారం పంపార‌ట‌.

అక్క‌డ పెద్దగా గొడవలేమీ లేవని, వస్తే మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశముందని ముంద‌స్తుగా స‌మాచార‌మిచ్చార‌ట‌.అంతేకాకుండా అగ్రవర్ణాలన్నీ పార్టీకి దూరమవుతాయని కూడా వివ‌రించార‌ట‌.

అయితే జగన్ మాత్రం వీటిని లెక్క చేయకుండా గ్రామాన్ని సందర్శించడంతో ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు జగన్ తీరుపై మండిపడుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ క్లీన్ స్వీప్ చేసేశాయి, గోదావ‌రి జిల్లాల్లో మ‌రీ ముఖ్యంగా ప‌శ్చిమ‌లో గెల‌వ‌లేక‌పోవ‌డం వ‌ల్లే అధికారానికి దూర‌మ‌య్యాన‌ని జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో చెబుతూ ఉన్నారు.

అందుకే ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు జ‌గ‌న్‌! ఇంతకుముందు ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధితల కోసం, పోలవరం నిర్వాసితుల కోసం జగన్ అనేక సార్లు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు.ఆ జిల్లాలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో.

స్థానిక వైసీపీ నేతలు జగన్ కు తప్పుడు సమాచారం ఇచ్చార‌ట‌.దళితుల కోసం వస్తే అగ్రవర్ణాల ఓట్లు పోతాయని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయ‌డం ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రాష్ట్రంలో అత్యధిక మంది దళితులు వైసీపీ పక్షానే నిలిచార‌ని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.జిల్లా నేతల మాటలను పట్టించుకోలేదు.

దీంతో జ‌గ‌న్ పర్యటనకు కూడా కొందరు వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు.సమస్య వచ్చినప్పుడు కులాలకు అతీతంగా స్పందించాల్సి ఉంటుందని నచ్చచెప్పటానికి జ‌గ‌న్‌ ప్రయత్నించినా.

వినిపించుకోలేద‌ట‌.తనకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు, లోకల్ గా దళితులకు వ్యతిరేకంగా కార్యక్రమాలను చేపట్టిన పార్టీ నేతలపై జగన్ వేటు వేయనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube