YCP 2024 Manifesto : వైసీపీ మేనిఫెస్టో ఇలా ఉండబోతుందా.. 2024 ఎన్నికల కోసం జగన్ ప్రకటించబోయే హామీలు ఇవేనా?

2024 ఎన్నికలు అటు వైసీపీకి ఇటు టీడీపీ, జనసేన( TDP, Jana Sena )లకు కీలకం అనే సంగతి తెలిసిందే.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 Ycp 2024 Manifesto Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం జగన్ ఈ హామీపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు కొన్ని మార్పులు చేయనున్నారని సమాచారం అందుతోంది.వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్( YSR Rythu Bharosa ) ద్వారా ప్రస్తుతం రైతులకు 13,500 రూపాయలు అందుతోంది.

ఈ మొత్తంలో 6,000 కేంద్రం వాటా కాగా మిగతా మొత్తం రాష్ట్రం వాటా అనే సంగతి తెలిసిందే.ఈ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచే యోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.

రైతు భరోసా మొత్తాన్ని జగన్ 20,000 రూపాయలకు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

Telugu Ap, Cm Ys Jagan, Jana Sena, Rayalaseema, Ycp Manifesto-Politics

అమ్మఒడి( Amma Vodi Scheme ), పింఛన్ మొత్తాన్ని పెంచే దిశగా సీఎం జగన్ అడుగులు పడుతున్నాయని భోగట్టా.డ్వాక్రా మహిళలకు ప్రయోజనం చేకూరేలా జగన్ ఒక హామీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.అమలు సాధ్యమయ్యే పథకాలను మాత్రమే ప్రకటించాలని జగన్ ఆలోచన అని భోగట్టా.

మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Telugu Ap, Cm Ys Jagan, Jana Sena, Rayalaseema, Ycp Manifesto-Politics

రాయలసీమ( Rayalaseema )లో వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉండగా ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ పైచేయి సాధించనుందని తెలుస్తోంది.మిగతా జిల్లాలలో వచ్చే సీట్ల ఆధారంగా వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తేలిపోనుంది. వైసీపీ నుంచి ఇప్పటికే ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది.చంద్రబాబు సైతం వరుస హామీలను ప్రకటిస్తూ 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడానికి తన వంతు కష్టపడుతున్నారు.2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube