Jai Hanuman Yash : జై హనుమాన్ లో హనుమంతుడిగా యశ్.. అలా జరిగితే రూ.1000 కోట్లు గ్యారంటీ అంటూ?

హనుమాన్ సినిమా( Hanuman Movie ) సృష్టించిన సంచలనాలను ప్రేక్షకులు మరవక ముందే జై హనుమాన్ సినిమా( Jai Hanuman )కు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వస్తున్నాయి.ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం మొదట చిరంజీవి పేరు వినిపించినా ప్రస్తుతం యశ్ పేరు వినిపిస్తోంది.

 Yash Playing Lead Role In Jai Hanuman Movie Details Here Goes Viral-TeluguStop.com

హనుమాన్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో సైతం అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.300 థియేటర్లలో ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శితమవుతూ నిర్మాతలకు లాభాలను అందిస్తోంది.

జై హనుమాన్ మూవీలో హనుమంతుడి రోల్<( Hanuman Role )/em> లో యశ్ నటిస్తే మాత్రం ఈ సినిమా సులువుగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. యశ్( Hero yash ) కు కూడా ఈ రోల్ పై ఆసక్తి ఉందని తెలుస్తోంది.కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత యశ్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికే యశ్ ప్రాధాన్యత ఇస్తున్నారు.హనుమంతుడి రోల్ లో నటించడం అంటే సులువైన విషయం కాదు.ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయని పక్షంలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

యశ్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా బడ్జెట్ లెక్కలు సైతం అమాంతం పెరుగుతాయని చెప్పవచ్చు.అయితే ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

జై హనుమాన్ మూవీలో హనుమాన్ గా యశ్ నటిస్తే రాముడి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube