నేటితో ముగియనున్న డబ్ల్యూపీఎల్ లీగ్ మ్యాచ్లు.. ఖరారైన ప్లే-ఆఫ్ బెర్తులు..!

Wpl 2023 These Teams Will Qualify For Playoffs Details,wpl 2023 , Wpl Playoffs, Up Warriors, Rcb, Mumbai Indians, Womens Ipl, Icici, Bcci, Gujarat Giants, Delhi Capitals, Ipl

అట్టహాసంగా మొదలైన డబ్ల్యుపీఎల్-2023( WPL 2023 ) లీగ్ మ్యాచ్లు నేటితో ముగియనున్నాయి.ఇంకా జరగాల్సిన మ్యాచులు ఉండగానే ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ చివరి స్థానంలో ఉండడంతో ప్లే-ఆఫ్ నుండి వైదొలగాయి.

 Wpl 2023 These Teams Will Qualify For Playoffs Details,wpl 2023 , Wpl Playoffs,-TeluguStop.com

యూపీ వారియర్స్( UP Warriors ) మూడో స్థానంలో ఉండి ప్లే- ఆఫ్ కు( Play off ) బెర్త్ ఖాయం చేసుకుంది.అయితే లీగ్ టేబుల్ లో మొదటి స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి.

మొదటి స్థానానికి చేరిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది.రెండవ స్థానానికి చేరిన జట్టు యూపీ వారియర్స్ తో ప్లే- ఆఫ్ మ్యాచ్ ఆడుతుంది.

డబ్ల్యూపీయల్ లో వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి లీగ్ టేబుల్ లో టాప్ లో ఉండే ముంబై ఇండియన్స్ రెండు వరస పరాజయాలతో రెండవ స్థానంలో కొనసాగుతుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ప్లేస్ కు వెళ్ళింది.నేడు జరిగే మ్యాచ్ లతో మొదటి మరియు రెండో స్థానాల్లో ఏ జట్లు ఉంటాయో తేలిపోతుంది.తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో 110 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9 ఓవర్లలోనే చేదించి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.ఆరంభం నుండి అద్భుత ఆటను ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ డీల పడిపోయింది.

తాజాగా జరిగిన యూపీ వారియర్స్- గుజరాత్ జెయింట్స్ మ్యాచ్లో, గుజరాత్ గెలిచి ఉంటే గుజరాత్ తో పాటు, బెంగళూరు జట్టుకు కూడా ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉండేవి.కానీ యూపీ వారియర్స్ గెలిచి మూడవ స్థానాన్ని పదిలం చేసుకొని ప్లే ఆఫ్ కు చేరింది.దీనితో ఇంకా లీగ్ లొ రెండు మ్యాచ్లు ఉండగానే గుజరాత్ జట్టు, బెంగళూరు జట్టు ప్లే-ఆఫ్ అర్హతను కోల్పోయాయి.నేడు ముంబై ఇండియన్స్-బెంగళూరు జట్టు మ్యాచ్ జరగనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్- యూపీ వారియర్స్ మధ్య జరిగే మ్యాచ్ ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్.

Wpl 2023 These Teams Will Qualify For Playoffs Details,wpl 2023 , Wpl Playoffs, Up Warriors, Rcb, Mumbai Indians, Womens Ipl, Icici, Bcci, Gujarat Giants, Delhi Capitals, Ipl - Telugu Bcci, Delhi, Gujarat, Icici, Mumbai Indians, Warriors, Womens Ipl, Wpl, Wpl Playoffs #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube