Golden stone Myanmar : ఈ బంగారు రాయిని మహిళలు తాకకూడదట... ఈ రహస్య కథనం ఎక్కడిదో తెలుసా?

బంగారు రాయి ఏమిటి, మహిళలు తాకకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ కధనం పూర్తిగా చదవలసిందే.ఈ భౌతిక ప్రపంచం వింతలు, విశేషాలకు పెట్టింది పేరు.

 Women Should Not Touch This Golden Stone Do You Know Where This Secret Story Is-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట ఇలాంటి అద్భుతాలు చోటుచేసుకునే ఉంటాయి.అయితే ఒకప్పుడు ఇలాంటి విషయాలు స్థానికంగా తప్ప, బయటివారికి తెలిసే అవకాశం ఉండేది కాదు.

కానీ నేడు స్మార్ట్ ఫోన్ పుణ్యమాని ఎలాంటి విషయాలనైనా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, చాలా దేశాలలో పురాతనమైన, నిగూఢ రహస్యాలు అనేవి పరంపరగా వాస్తు ఉంటాయి.

అలాంటి ఓ చారిత్రక విషయం మయన్మార్‌లో కూడా కలదు.ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉండే ఓ రాయి కథనే ఇపుడు తెలుసుకోబోతున్నాం.

దాదాపు 1100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ బంగారు రాయి.ఎలాంటి సపోర్టు లేకుండా ఒక వైపునకు వంగి ఉండటం విశేషం.

భారీ తుపానులు, గాలి దుమారాలు వచ్చినా తట్టుకుని నిలబడే సామర్ధ్యం దీని సొంతం.కాగా 1100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ రాయికి బంగారు వర్ణం పూయడం కూడా ఓ ప్రత్యేకతనే.

Telugu Cacteo Pagoda, Golden Rock, Golden Stone, Myanmar, Secret Story, Womens-L

అందుకే దీనిని గోల్డెన్ రాక్, క్యాక్టియో పగోడా అని అంటారు.ఏళ్ల తరబడి ఈ రాయి అలాగే ఉన్నప్పటికీ ఒక్క ఇంచు కూడా కదల్లేదు.ఎవరూ దానిని కదించలేరని కూడా అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం.వాలు అంచున దర్జాగా ఉన్న ఈ భారీ ఒక రహస్యం అని స్థానికులు కధలుకధలుగా చెబుతుంటారు.అంతేకాకుండా ఈ రాయి బుద్దుడి కేశాలపై ఉందని విశ్వసిస్తారు.11వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి దీనిని ఒక వాలుపై నిలిపారని, అప్పటి నుంచి ఇప్పటి వరకకు అది అక్కడే, అలాగే ఉందని చెబుతారు.ఇక్కడ వున్న మరో ట్విస్ట్ ఏమంటే, ఈ భారీ రాయిని ఒక స్త్రీ మాత్రమే కదిలించగలదట.ఆ కారణంగానే స్త్రీలు ఆ రాయిని తాకకూడదనే షరతు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube