ఎండాకాలంలో బీచ్ ఒడ్డున ఉండే వాతావరణం చాలా హాట్ గా ఉంటుంది.అక్కడ ఉండే ఇసుక బాగా వేడెక్కి అంత త్వరగా చల్లార్చడం.
అందువల్ల శరీరం ఉడికినట్లు అనిపిస్తుంది.అంతేకాదు సూర్యకిరణాలు నీటిపై పడి ఒడ్డుపై కూడా రిఫ్లెక్ట్ అవుతుందని అంటుంటారు.
అందుకే అక్కడికి వెళ్లే వారు సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకుంటారు.కానీ ఇటీవల సిరిన్ అనే 25 ఏళ్ల యువతి సన్ స్క్రీన్ లేకుండా ఒక బల్గేరియన్ బీచ్‌కి వెళ్ళింది.
అంతేకాదు, అక్కడే 30 నిమిషాల పాటు నిద్ర పోయింది.అయితే సర్రుమనే ఆ ఎండకు ఆమె ముఖ చర్మం బాగా దెబ్బతిన్నది.
నిద్ర లేచి తన ముఖం చూసుకున్న తర్వాత గానీ ఆ యువతికి ఆ విషయం అర్థం కాలేదు.
అద్దంలో చూసుకున్నప్పుడు తన ముఖానికి ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా కనిపించింది.
దాంతో సిరిన్ గుండె పగిలింది.ఈమె వృత్తిరీత్యా బ్యూటీషియన్.
అందర్నీ అందంగా మార్చే ఈ ముద్దుగుమ్మను సూర్యుడు మాత్రం అందవిహీనంగా మార్చాడు.తన ముఖానికి ఏమైందో ఏమో అని భయపడిన ఆ యువతి వెంటనే కుటుంబ సభ్యులను ఆశ్రయించింది.
వారు ఆమెకు ధైర్యం చెప్పారు.కాగా కొద్దిరోజుల సమయంలోనే ఫేస్ ఎర్రగా అయ్యిందని, ఆపై ముఖంపై ముడతలుగా వచ్చాయని, నుదురు, కళ్ల చుట్టూ చిన్న చిన్న మచ్చలు కూడా ఏర్పడ్డాయని ఆమె తెలిపింది.
నొప్పి తగ్గి నల్లగా మారిపోయిన చర్మం ఊడిపోవడం వల్ల తనకు చాలా రిలీఫ్ గా అనిపించిందని వెల్లడించింది.ఇప్పుడు తన పాత చర్మం తొలగిపోయి కొత్త చర్మం తో ముఖం చాలా అందంగా తయారయింది అని ఆమె సంతోషంగా తెలిపింది.అయితే ఎవరూ కూడా ఎండ వేడిమిలో నిద్ర పోకూడదని సూచించింది.