దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిరేపిన కర్నాటక ఎన్నికలు( Karnataka Elections ) ఎట్టకేలకు ముగిశాయి.తుది ఫలితాలు కూడా వెలువడ్డాయి.
మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్( Congress ) ఎవరు ఊహించని విధంగా 136 సీట్లు కైవసం చేసుకోగా, బిజెపి కేవలం 64 సీట్లకే పరిమితం అయింది.ఇక జెడిఎస్ 20 సీట్లు, ఇతరులు 4 సీట్లు సొంతం చేసుకున్నౌయి.
ఇక అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించనుంది.మొత్తానికి కర్నాటక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణపై పడింది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.దాంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ తెలంగాణపై ఫోకస్ పెట్టాయి.
కర్నాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది.కర్నాటకలో ఏ స్ట్రాటజీతో విజయం సాధించిందో అదే స్ట్రాటజీని తెలంగాణలో కూడా అమలు చేసి అక్కడ కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఇక దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అధికారం ఉన్న ఒక ఒక్క రాష్ట్రం కర్నాటక కూడా చేజారిపోవడంతో ప్రస్తుతం కాషాయపార్టీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది.ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో గెలిచి అదే ఊపును తెలంగాణలో కూడా కొనసాగించాలని భావించిన బీజేపీ ఆశలపై కన్నడిగులు నీళ్ళు చల్లారు.
దీంతో తెలంగాణలో గెలుపు కోసం మళ్ళీ పునః వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ( BJP ) రైజింగ్ పార్టీగా ఉన్నప్పటికి కర్నాటక ఫలితాలు తెలంగాణలో బీజేపీపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.దాంతో కర్నాటకలో జరిగిన పరాభవాన్ని పూర్తిగా పక్కన పెట్టి.తెలంగాణపై ఫ్రెష్ మైండ్ తో దృష్టి పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.
కాగా కర్నాటకతో పోల్చితే తెలంగాణలో పరిస్థితులు పూర్తి భిన్నం.ఇక్కడ కేసిఆర్ నేతృత్వంలో ఉన్న బిఆర్ఎస్ ను( BRS party ) గద్దె దించడం అంతా తేలికైన విషయం కాదు.
ప్రస్తుతం ఏ రకంగా చూసుకున్న తెలంగాణలో బిఆర్ఎస్ అత్యంత బలమైన పార్టీగా ఉంది.ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు తెలంగాణలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.