మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ).అందుకే ప్రభుత్వంలోనూ, పార్టీలోను నెలకొన్న అన్ని ఇబ్బందులను తొలగించుకుని ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇటీవల కాలంలో కాంగ్రెస్, బిజెపి దూకుడుగా వ్యవహరిస్తుండడం, చేరికలతో హడావుడి చేస్తుండడం, పార్టీలో తమకు నమ్మకస్తులు తగ్గిపోవడం, బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తమ వెంట నడిచిన నాయకుల సంఖ్య తగ్గిపోవడం వంటి అన్ని విషయాల పైన కెసిఆర్ విశ్లేషణ చేసుకుంటున్నారు.కీలక వ్యక్తులు కొన్ని కొన్ని కారణాలతో అసంతృప్తికి గురవడం, స్వచ్ఛందంగా వారు పార్టీ నుంచి వెళ్లిపోవడం, మరి కొంతమందిపై సస్పెన్షన్ వేటు వేయడం వంటి అన్ని విషయాలు గుర్తు చేసుకుంటున్నారు.ముఖ్యంగా హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పార్టీకి దూరం చేసుకుని తప్పు చేసాము అనే భావన ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ లలో కలుగుతున్నాయి.
2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసి పనిచేసి 2014లో అధికారంలోకి వచ్చేలా చేయడంలోనూ ఈటెల రాజేందర్ ( Etela rajendar)కీలక పాత్ర పోషించినా, 2021 మేలో భూ ఆక్రమణ ఆరోపణలపై రాజేందర్ ను కెసిఆర్ మంత్రి వర్గం తొలగించారు.దీంతో బీఆర్ఎస్ కు రాజేందర్ కు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.అయన బీజేపీ లో చేరి, ఎమ్మెల్యే గా పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు.
అయితే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ లు రాజేందర్ విషయంలో సానుకూలంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.బిజెపిలో రాజేందర్ ఇబ్బందులు ఎదుర్కోవడం, పార్టీ మారే ఆలోచనలో ఉండడంతో, మళ్లీ ఆయనను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే, పార్టీకి ,తమకు మేలు జరుగుతుందనే అభిప్రాయంలో కేసీఆర్, కేటీఆర్ ను ఉన్నారట.
ఇటీవల ఈటెల రాజేందర్ ను హత్య చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి( Padi Kaushik Reddy ) 20 కోట్ల సఫారీ ఇచ్చారని, ఈటెల రాజేందర్ కు ప్రాణహాని ఉంది అంటూ రాజేందర్ భార్య జమున మీడియా సమావేశంలో చెప్పారు.దీనిపై కేసిఆర్ వెంటనే స్పందించి రాజేందర్ కు భద్రత పెంచాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను ఆదేశించారు.రాజేందర్ భద్రత విషయంలో కేటీఆర్ కూడా స్పందించారు.దీంతో ఆయనకు వై క్యాటగిరి భద్రతను కల్పిస్తూ, బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు, 16 మంది భద్రత సిబ్బందిని సమకూర్చారు.
<img src=" https://telugustop.com/wp-content/uploads/2023/07/telangana-cm-congress-telangana-elections-padi-koushik-reddy-etela-Jamuna.jpg”/>
రాజేందర్ పై వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలనీ చూస్తున్న పాడి కౌశిక్ రెడ్డి గతంలో రాజేందర్ తన హత్యకు ప్లాన్ చేశారని మీడియా ప్రకటన విడుదల చేశారు.అయినా కేసీఆర్, కేటీఆర్ లు స్పందించలేదు.ఆయనకు ఎటువంటి అదనపు బాధ్యతలు కల్పించలేదు కానీ, తమ ప్రత్యర్థైన రాజేందర్ విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించడంతో, ఆయనను మళ్ళీ బీఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.రాజేందర్ సైతం బిజెపిలో ఇమడ లేకపోవడం, అక్కడ గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడం వంటి వ్యవహారాలతో ఇబ్బందులు పడుతుండడంతో, ఆయన బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.