తెలుగు సినిమాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నటుడు ఎన్టీఆర్.అన్ని రకాల సినిమాల్లో నటించి అందరిచేత ప్రశంసలు దక్కించుకున్న నాయకుడు.
ఆయన ఏ సినిమా చేసినా.అనుకున్న ప్రకారం జరిగేలా చూసుకునే వారు.
ఆయన సినిమాల్లో నటించే నటుల విషయంలో కొన్ని షరతులు పెట్టేవాడు.ఆయా నటులు వాటిని తప్పకుండా పాటించాల్సి ఉండేది.
కానీ ఒకానొక సమయంలో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మాత్రం కొన్ని రూల్స్ అతిక్రమించాడు.ఎన్టీఆర్ రూల్స్ బ్రేక్ చేయడం అనేది మామూలు విషయం కాదు.
ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమా దాన వీర శూర కర్ణ.
ఈ సినిమా సమయంలోనే క్రిష్ణ హీరోగా కురుక్షేత్రం అనే భారీ బడ్జెట్ సినిమా కూడా తెరకెక్కింది.ఈ రెండు సినిమాలు ఓకేసారి షూటింగ్ జరగడంతో నటీనటులకు డేట్ల అడ్జెస్ట్ విషయంలో చాలా సమస్యలు వచ్చాయి.
అందుకే తన సినిమాలో నటించే మరే నటుడు క్రిష్ణ సినిమాలో నటించ కూడదని చెప్పాడు.అంతేకాదు.ఈ సినిమా అయిపోయే వరకు ఏ నటుడు నాన్ వెజ్ తినకూడదని వెల్లడించాడు.మాదాల రంగారావు మాత్రం మాంసం తినకుండా ఉండలేనని చెప్పాడు.
దీంతో ఆయన స్థానంలో హరిక్రిష్ణను పెట్టుకున్నాడు.అయితే ఎన్టీఆర్ నిబంధనను కాదని.
కైకాల కురుక్షేత్రం సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు.అదే సమయంలో ఎన్టీఆర్ సినిమాలో నటించాలా? వద్దా? అనే సంశయంలో ఉన్నాడు.
ఎన్టీఆర్ కు మాత్రం కైకాలను వదులుకోవాలని లేదు.ఆయన ఒక్కడికి రెండు సినిమాల్లో నటించే అవకాశం కల్పించాడు.43 మూడు రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేశాడు రామారావు.ఇందులో భీముడి క్యారెక్టర్ చేశాడు కైకాల.
కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన కురుక్షేత్రం మూవీలో దుర్యోధనుడిగా చేశాడు.అయితే దానవీర శూర కర్ణ భారీ విజయాన్ని అందుకుంది.
కురుక్షేత్రం సినిమా మాత్రం జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది.అయితే కైకాలకు మాత్రం రెండు సినిమాల్లోనూ మంచి పేరు వచ్చింది.